పెండింగ్ లో ఉన్న డిఏ లను విడుదల చేయాలి

వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండలంలోని టిటి డబ్ల్యూ ఆర్ జెసి బాయ్స్ గుండాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల గుండాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండాల లను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సందర్శించి ఉపాధ్యాయ అధ్యాపకుల ఉద్దేశించి మాట్లాడారు . పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలను విడుదల చేయాలని, గురుకుల,ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లకు,కేజీబీవి టీచర్లకు,ఎస్ ఎస్ఏ ఉద్యోగులకు మినిమం టైమ్స్ స్కేల్ వర్తింపచేయాలని, గురుకుల పాఠశాలల్లో పని వేళలు మార్చాలని, ఇ కుబేర్ లో పెండింగ్ ఉన్న బిల్లు లను చెల్లించాలని కోరారు.అన్ని రకాల గురుకుల పాఠశాలలో రెండు డిప్యూటీ వార్డెన్ పోస్ట్ లు మంజూరు చేయాలని కోరారు. ఈ ఆరు సంత్సరాల కాలం లో ఉత్తమ పనితీరు కనపరిచారని ఉపాధ్యాయులు, అధ్యాపకలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.తమ మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు. ఈ సందర్శన లో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి ఈ . హతీరామ్, అల్లపల్లి ప్రధాన కార్యదర్శి సురేష్,గుండాల మండలం అధ్యక్ష కార్యదర్శులు పి.బాలస్వామి, రూప్ సింగ్, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version