రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఉపాధిహమీ పనులను సందర్శించిన బికెయంయు రాష్ట్ర కార్యదర్శి సృజన్ కుమార్ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ ఉపాధిహామీ కూలీలకు గత నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రమకు తగిన ఫలితం లేకుండా పోతుందని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కొలతల ఆధారంగా పని చూడకుండా కూలీల వేతనాలు పెంచాలని, ఆధార్ లింక్ తో పని చేసిన డబ్బుల మెసేజ్ వస్తున్న ఖాతాల్లో డబ్బులు పడడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, గత పాలకుల నుండి కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పనులకు మళ్లించడం వల్ల పని చేసిన పదిహేను రోజులకే బిల్లులు పడాల్సింది నెలలు పడుతుందని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనచట్టం ప్రకారం ఉపాధిహామీ కూలీలకు రోజు వారీ కూలీ ఆరువందల రూపాయలు చెల్లించాలని, రెండువందల రోజుల పని కల్పించాలని, పని ప్రదేశాలు దూరంగా ఉంటే రవాణా ఖర్చులు ఇవ్వాలని, ఉపాధి కూలీలకు ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇవ్వాలని, యాభైసం.లు నిండిన వారికి ఐదువేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, పనిగ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో గంటే రాజేశం, ఎగుర్ల మల్లేషం, కనకయ్య, ఐలయ్య, రాజవ్వ విజయ, లక్ష్మీ, లలిత, జ్యోతి, మాధవి, వనిత, శైలజ, రాజవ్వ, కనుకలక్ష్మీ, మల్లవ్వ, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.