వనపర్తి నేటిధాత్రి
పాన్ గ ల్ మండలం వనపర్తి జిల్లా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఒక్కొక్కరికి 5 . 6 వారాలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని దళిత నాయకులు ఆదిస్వామి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికల ముందు డబ్బులను విడుదల చేసి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులపై వివక్షత చూపుతూ ఉపాధి హామీ కార్మికుల బకాయిలు పెండింగ్ లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నార ని అన్నారు నిరు పేదల కు ఎలాంటి పనులు లేక వారు ఉపాధి హామీ పథకం పై ఆధారపడి జీవిస్తున్నారని కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ కార్మికుల పట్ల పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని సంవత్సరా నికి 200 రోజుల పని దినాలు కల్పించాలని ఎస్సీ ఎస్టీలకు 360 రోజులు పని దినాలు కల్పించాలని రోజుకు 400 రూపాయలు చొప్పున ఉపాధి హామీ కార్మికులకు వేతనం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఆది గోపీచందర్ లింగాల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
