ఖానాపూర్ మండలం బిఆర్ఎస్ ముఖ్య నాయకులు
ఖానాపూర్ నేటిధాత్రి
పెద్ది గెలుపుకోసం పట్నం,పల్లె,తండా,గూడెం ఏకం అవ్వాలే-పెద్దన్న కారు గుర్తుకే ఓటు వెయ్యాలే నర్సంపేట ప్రాంతంలో పెద్దన్న చేసిన అభివృద్దే మనకు ప్రచార అస్త్రం అన్ని వర్గాలకు అండగా ఉన్న బిఆర్ఎస్ మ్యానిఫెస్టో పెద్ది గెలుపుకోసం బూత్ లెవల్ కమిటీల్లో పాల్గొన్న ఒడిసిఎంస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్,ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు,మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్,రైతు బంధు మండల కన్వీనర్ కుంచారపు వెంకట్ రెడ్డి,మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ సదర్ లాల్,స్థానిక సర్పంచులు,క్లస్టర్ బాద్యులు బుధరావు పేట,వేపచెట్టు తండా,భద్రు తండా గ్రామాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఖానాపురం మండలానికి శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన అభివృద్దే తప్ప మిగతా నాయకులు చేసింది శూన్యం పాకాల సరస్సులోకి 336 కోట్ల రూపాయలతో గోదావరి జలాలు తీసుకవచ్చి ఈ ప్రాంత సస్యశ్యామలం చేసిన పెద్దికే మద్దతు ప్రకటిద్దాం. ప్రస్తుతం నడుస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా అద్భుతమైన పథకాలతో కూడిన BRS మ్యానిఫెస్టో సబ్బండ వర్గాలకు న్యాయం కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా(తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుపేదలకు 5 లక్షల సాధారణ భీమా సౌకర్యం అన్నపూర్ణ పథకం(రేషన్ కార్డు అందరికి సన్న బియ్యం కేసీఆర్ ఆరోగ్య రక్షఅర్హులైన వారందరికీ ఆరోగ్య వారందరికీ 15 లక్షల భీమా సౌభాగ్య లక్ష్మీ(పేద మహిళలందరికి 3,000 రూపాయల పెన్షన్ ఆసరా పెన్షన్ 5016 వేలు,వికలాంగులకు 6016 వేల రూపాయలకు పెంపు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎకరాకు 16,000 వేల రూపాయల రైతుబందు మహిళ సాధికారత (మహిళ సంఘాలకు సొంత భవనాలు)కేసీఆర్ సాధ్యం అగ్రవర్ణ పేద విద్యార్థులకు నియోజకవర్గానికి రెసిడెన్షియల్ హాస్టల్ అర్హులైన BC కుటుంబాలకు 1 లక్ష రూపాయల ఆర్థికసహాయం అందజేత దళిత కుటుంబాలకు 10 లక్షల చేయూత కొనసాగింపు కళ్యాణలక్ష్మి లక్ష రూపాయల నుండి 2,00,000 లక్షల రూపాయలకు పెంపు గిరిజనేతరులకు కూడా పోడు భూములకు హక్కు పత్రాలు అందజేత అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి పూర్తి హక్కులు కల్పించే బాధ్యత కేసిఆర్ హామీ ఇన్ని హామీలతో ప్రజారంజక పాలన అందించే కేసీఆర్ కే మద్దతు ఇద్దాం కారు గుర్తుకే ఓటువేద్దాం అభివృద్ధి కి అండగా నిలపడుదాం-పెద్దన్న నే గెలిపిద్దాం. మండలం ముఖ్య నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.