రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ జాతర 32వ వార్షికోత్సవం సందర్భంగా వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సంఘం పెద్దలు మాట్లాడుతూ మర్చి 29 నాడు పెద్దమ్మ కళ్యాణం మరియు సాయంత్రం బోనాలు సమర్పిస్తారు రాత్రి ఒగ్గు కథ కార్యక్రమం, మార్చి 30 నాడు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంత్రం బండ్ల ఊరేగింపు మరియు గావు కార్యక్రమం ఉంటాయని ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయగలరని కోరుతున్నాము, ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సదర్ సంఘం అధ్యక్షులు పోచమ్మ సిద్ధిరాములు ఉపాధ్యక్షులు రేడ్డమైన నరేష్, ప్రధాన కార్యదర్శి భూమ రమేష్ కోశాధికారి దేవుని నర్సింలు మరియు సలహాదారులు బండి ఆనంద్, అక్కల మల్లేశం, ముదిరాజ్ యూత్ అధ్యక్షులు చిలుక రమాకాంత్ కౌన్సిలర్ చిలుక గంగాధర్, కౌన్సిలర్ దేవుని జయరాజు మరియు చింతల నరేష్ పోచమ్మల గణేష్ మరియు చిలక విరాట్ పోచమ్మల భాను చింతల రాకేష్ దేవుని పవన్ ముదిరాజ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది