# డివిజన్ అధ్యక్షుడు కొమ్ముక రవి, కార్యదర్శి విక్రమ్
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని జరిగిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నర్సంపేట డివిజన్ కమిటీ ఎన్నుకున్నారు.నర్సంపేట పట్టణంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో నూతన డివిజన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా 9 మందితో ఎన్నుకున్నట్లు రాష్ట్ర కమిటీ సభ్యుడు రాచకొండ రంజిత్, జస్విత్ తెలిపారు.
అధ్యక్షుడుగా కొమ్ముక రవి,కార్యదర్శి ఆబర్ల విక్రమ్,సహాయ కార్యదర్శి ప్రశాంత్,ఉపాధ్యక్షుడిగా రేవంత్, డివిజన్ కార్యవర్గ సభ్యులుగా సాగర్, ప్రశాంత్,సాయి,హర్షవర్ధన్,సాయి చరణ్ తేజల నూతన కార్యవర్గాన్ని కౌన్సిల్ ఏకీక్రమంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.ప్రగతిశీల నూతన సమాజ స్థాపన కోసం విద్యార్థులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించినారు.ఉస్మానియా అరుణతార జాజిరెడ్డి.జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ తో పాటు అనేకమంది విద్యార్తి రత్నాలు తమ విలువైన ప్రాణాలను ప్రజల కోసం అర్పించారని వారు సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.