@ఎనిమిది టీవీఎస్ ఎక్సెల్ బండ్లు సీజ్.
#నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలోని అప్పాలరావుపేట గ్రామంలోని గోనె ఆనందం రైస్ మిల్లు టాస్క్ ఫోర్స్ సీఐ బాబూలాల్ ఆధ్వర్యంలో రామన్నకుంటకు చెందిన కొందరు వ్యక్తులు పలు గ్రామాల్లో పిడిఎఫ్ రైస్ సేకరించి గోనె ఆనందం కు అమ్ముతున్నారని పక్క సమాచారంతో దాడులు నిర్వహించగా రామన్నకుంటకు చెందిన గూగులోతు రవి, బానోతు నెహ్రూ, బానోతు సురేష్, విజయ్, తిరుపతి, గూగులోత్ గణేష్, శ్రీను, వెంకన్న లు టీవీఎస్ ఎక్సెల్ వాహనాలపై పిడిఎఫ్ బియ్యం ను గొనే ఆనందం రైస్ మిల్లు కు తరలించగా 20 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకోగా బియ్యం విలువ 52000 ఉంటుందని అలాగే ఎనిమిది ఎక్సెల్ బండ్లను సీజ్ చేసి స్థానిక నెక్కొండ ఎస్సై మహేందర్ కు అప్పగించి వారిపై కేసు నమోదు చేసినట్లుగా టాస్క్ ఫోర్స్ సిఐ బాబూలాల్ తెలిపారు. ఈ దాడులలో నెక్కొండ ఎస్సై మహేందర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, నెక్కొండ పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.