నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నర్సంపేట మండలానికి చెందిన కర్నాటి పార్వతమ్మ ఎంపికయ్యారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు చేతుల మీదుగా రెండవసారి వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కర్నాటి పార్వతమ్మ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షురాలుగా రెండో సారి ఎన్నికైనట్లు తెలిపారు.తన ఎన్నికకు కృషిచేసిన ఏఐసీసీ కమిటీకి, రాష్ట్ర నాయకత్వానికి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కూడా చైర్మన్లు, నాయకులకు,మహిళా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.ఎన్నిక తనపై మరింత భారం పెంచిందన్నారు. పార్టీకి వన్నెతెచ్చే విధంగా పనిచేస్తానని పార్వతమ్మ పేర్కొన్నారు.