మల్కాజిగిరి
14 నవంబర్
సీనియర్ నాయకుడు అయిన తనకు, కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం దక్కలేదని మనస్తవంతోనే టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోనగిరి సురేష్ యాదవ్ ఉన్నారు.మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బోనగిరి సురేష్ యాదవ్, మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా సురేష్ యాదవ్ తో పాటు అతని అనుచరులను కండువా కప్పి శంబిపూర్ రాజు బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రానున్న ఎన్నికలలో మరి రాజశేఖర్ రెడ్డి గెలుపుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని సురేష్ యాదవ్ సూచించారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాసరావు,మాజీ మున్సిపల్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి,గౌతమ్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్, ఇన్చార్జ్ నరసింహ యాదవ్,నాయకులు మెహర్ బాబు, సిద్ధి రాములు,మల్లేష్ యాదవ్, బాచి,తదితరులు పాల్గొన్నారు.