విద్యార్థులు మానసిక ఉత్తేజానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లాలోని విద్యార్థులు ఇతరులు మానసిక పరిస్థితులపై తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు గతంలో జరిగిన సంఘటన దృశ్య విద్యార్థులు ఇతర మానసిక
ఒత్తిడిలో ఉన్న పరీక్షల్లో ఫెయిల్ అయినా తాగుడు మన లేకపోతున్నా ఇతర మానసిక సమస్యల్లో బాధపడుతున్న తీవ్రమైన ఒత్తిడికి ఎదుర్కొంటున్నారు విషాదకరంగా కొందరు ఆత్మహత్య చర్యలు పాల్పడుతున్నారు ఇలాంటి సంఘటన జరగకుండా సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వాలు టెలి మానస్ అనే సేవలు ప్రారంభించినట్లు తెలిపారు ఈ టెలిమానస్ అనేది ఉచిత టెలి మానసిక ఆరోగ్య సేవ అని 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు పరీక్ష ఫలితాలు గురించి ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు ముఖ్యంగా వారి తల్లిదండ్రులు సమాజాన్ని ఎదుర్కొనడంలో ఈ టెలి మానస సహాయం అవసరమని భావించి విద్యార్థులతో పాటు మానసిక ఒత్తిడికి గురైన ప్రతి ఒక్కరికి ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు ఈ టెలి మనసు సంప్రదించినప్పుడు వారికి నచ్చిన భాషల్లో పలకరిస్తారని అప్పుడు వారు శిక్షణ పొందిన మానసిక ఆరోగ్య నిపుణులతో కనెక్ట్ చేస్తారని వారు వారి సమస్యలను వినడానికి తగిన మార్గదర్శకత్వం మద్దతును అందించడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు ఈ నిపుణులలో మానసిక వైద్యులు క్లీనికల్ సైకాలజిస్ట్లు మానసిక సామాజిక కార్యకర్తలు వివిధ మానసిక ఆరోగ్య సమస్య నిర్వహించడంలో బాగా ప్రావీణ్యం ఉన్న మానసిక నర్సులు ఉంటారని తెలిపారు తా టెలి మానస్ కేవలం హెల్ప్ లైన్ మాత్రమే కాదని ఆపదలో ఉన్న వారికి రక్షణ కవచం అన్నారు తెలియ మానసిక ఆరోగ్య చుట్టూ ఉన్న కలకలం విస్తృత సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు విద్యాపరమైన ఘోషమైన మద్దతును అందించడం ద్వారా భయపడకుండా సహాయం కోరెందుకు మరింత మంది విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు అంతిమ లక్ష్యం విద్యార్థులను తమ మానసిక సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడానికి శక్తివంతగా సహాయక వాతావరణంలో సృష్టించడం అన్నారు పరీక్ష ఫలితాలు వారి విలువలను భవిష్యత్తును నిర్వహించగలరు విద్యార్థులందరూ తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు ఫలితాల్లో సంబంధం లేకుండా విద్యార్థులు ఎదుర్కొని ఏమైనా సవాల్లో వారికి సహాయం కావాలంటే లేదంటే ఎవరితో మాట్లాడి వారికి మద్దతు ఇచ్చే వ్యక్తుల వనరులు అందుబాటులో ఉన్నాయన్నడానికి టెలి మానస ఉచిత కౌన్సిలింగ్ కొరకు సంప్రదించడానికి వెనుకాడ వద్దని తెలిపారు హెల్ప్ లైన్ నెంబర్ 14416 లేదా18008914416 అని తెలిపారు ఇంతే కాకుండా తీవ్రమైన ఆందోళనకు గురయ్యే విద్యార్థులను మరి ఇతరులు భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గల మానసిక వైద్యులు సంప్రదించి సేవలు పొందగలరని తెలిపారు పరీక్షల్లో ఫెయిల్ కావడం తప్పుకాదు ఆత్మహత్యకు సంబంధించిన ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచన చేయడం తప్పు అని సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version