మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఇంటిదగ్గర చదువుకునే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని అదే విధంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణం అసంపూర్తిగా ఉంది కాబట్టి త్వరగా వాటిని పూర్తి చేయాలని చర్చించడం జరిగింది కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణదేవి,ఉపాధ్యాయులు బోరు కృష్ణయ్య, కె.వెంకటయ్య,కె. సికిందర్, కె. తుకారం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.