బి. ఆర్. ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం ప్రాంగణంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలచే కొలువబడుతున్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇందుకు నిరసనగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సగౌరవంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఈరోజు బి. ఆర్. ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యం లో పంచామృత అభిషేకాలు నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇట్టి కార్యక్రమంలో నాఫ్స్కబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి, జిల్లా గ్రంథాలయ మాజీ అధ్యక్షులు ఆకునురి శంకరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని వారి సందేశాన్ని అందించగా వీరితోపాటు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని పంచామృతాలతో తెలంగాణ తల్లి విగ్రహానికి అభిషేకం నిర్వహించి వారి నిరసనను తెలియజేశారు…