పార్లమెంట్ ఎన్నికల వేళ..
కాంగ్రెస్ బి ఆర్ ఎస్ లకు భారీ షాక్.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి అరుణమ్మకు పెరుగుతున్న మద్దతు
>.అరుణమ్మ ఆధ్వర్యంలో బిజేపీలోకి జోరందుకున్న చేరికలు
>.అరుణమ్మ ఆధ్వర్యంలో బిజేపీలో చేరిన 600 మంది యువకులు
>.కాషాయ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించిన డీకే.అరుణమ్మ
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థి అరుణమ్మ మేనియా మొదలైంది. ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చింది మొదలు అన్ని వర్గాల నుంచి మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఆదివారం నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 600 నుంచి మంది యువకులు అరుణమ్మ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా వీరందరికి అరుణమ్మ కాషాయ కండువాలు కప్పి పార్టీ లోకి సాధారంగా స్వాగతించారు.
మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని 29 వా వార్డ్ నుంచి డీకే.అర్జున్ రెడ్డితో పాటు మహబూబ్ నగర్ మార్కెట్ రోడ్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని జడ్చర్ల, నవాబ్ పేట్, కాకర్లపాడు, వల్లూరు, రుద్రారం గ్రామాలకు చెందిన సుమారు 300 మందితో పాటు, మహబూబ్ నగర్ లోని 42వ శక్తిపీఠం ఇంచార్జ్ మహేష్ ఆధ్వర్యంలో వేపగిరి నుంచి 40 మంది,43వ వార్డు నుంచి పార్టీ నేతలు నరహరి, ప్రణయ్ ఆధ్వర్యంలో మరో 40 మందితో పాటు ఆయా మండలాలకు చెందిన మరో 200 మంది యువకులు అరుణమ్మ ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు.
>.అరుణమ్మ కామెంట్స్
ఈ దేశం యొక్క యువత భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలి
ఉత్సాహంతో పార్టీలో చేరిన యువతకు ధన్యవాదాలు
మీమీ వార్డులలో ఈసారి గట్టిగా పని చేయండి
పార్టీ గెలుపులో యువత కీలకపాత్ర పోషించాలి
ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలి
కాంగ్రెస్ అమలుకు నోచని హామీలతో కాంగ్రెస్ అదికారం లోకి వచ్చింది
ఎన్నికలముందు ఏం చెప్పిందో బీజేపీ అది చేసి చూపిస్తుంది
ఈ దేశ భవిష్యత్తు కోరే వాళ్లంతా బీజేపి మద్దతు తెలపాలి
మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలంటే యువత బీజేపీకి నరేంద్ర మోదీకి మద్దతుగా నిలవాలి
మోదీ చేపట్టిన వికసిత్ భారత్ లక్షసాధనలో యువత పాత్ర పోషించాలి.