మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి ప్రాంతంలోని స్థానికులకే సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు ఇవ్వడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా నాయకులు సోత్కు సుదర్శన్, పుల్లూరి లక్ష్మణ్ లు మాట్లాడుతూ, సింగరేణిలో స్థానికులకు 80 శాతం ఉద్యోగ కల్పనకు కృషిచేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉండటం వల్ల స్థానికులు అనేక ఇబ్బందులు పడ్డారని, గత 30 ఏళ్లుగా స్థానిక యువకులు పడుతున్న బాధలను చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అర్థం చేసుకొని, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులకు 80శాతం ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన స్పందించి, సింగరేణిలో యువకులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి, వెంటనే ఆ విధంగా చర్యలు తీసుకోవడం హర్షనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు నేరువట్ల శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గడ్డం రజిని, నాయకులు కనకం రాజు, దుర్గం ప్రభాకర్, ఎండి సుకూర్, బుర్ర ఆంజనేయులు గౌడ్, బూడిద శంకర్, వడ్లూరి సునీల్ కుమార్, ఆకుదారి శ్రీనివాస్, ఎర్ర రాజు, రాయబారపు కిరణ్, గడ్డం శ్రీనివాస్, రెడ్డి ఐలయ్య, శేఖర్, మహిళా నాయకురాలు రాధ, స్రవంతి, శ్రీలత, సమత, సుమలత, రాజేశ్వరి, కనక లక్ష్మీ, లావణ్య, నాయకులు రాచర్ల గణేష్, కొత్తపల్లి రాయమల్లు, రంజిత్, భూకాల సంతోష్, శివప్రసాద్ లు పాల్గొన్నారు.