ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన మారాసు గంగాధర్

ఎట్ట పాక నేటి ధాత్రి

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం లో మారాసు గంగాధర్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వస్తున్నటువంటి శ్రీ వారి లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు 11 రోజు దీక్ష చేపడుతున్నారు దానికి మద్దతుగా వెంకట్ రెడ్డి పేట గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో శుద్ధి చేసి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రాయశ్చిత్త దీక్షలో ఒకరోజు కూర్చోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మారాసు గంగాధర్ మాట్లాడుతూ ఇటువంటి అపచారాన్ని హిందూ సమాజం మొత్తం ముక్తకంఠంతో ఖండిస్తుందని సనాతన ధర్మాన్ని పరిరక్షించాలంటే హిందువులందరూ తీవ్రంగా పరిగణించాలని అలాగే అన్యమతస్తులను కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో ఉంచకూడదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమరసత సేవ ఆధ్యాత్మిక ప్రసంగీకులు సేలం పుల్లారెడ్డి ఆధ్యాత్మికత గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ కొమ్ము వెంకట్ ఉపాధ్యక్షులు గోవిందు వెంకటేష్ కార్యదర్శులు జలగం శ్రీను గోడేటి నాగరాజు గొల్లవెళ్లి పృద్వి సత్యనారాయణమ్మ గంజి వెంకటేశ్వరరావు బిజెపి నుంచి నోముల రామారావు పాయ వెంకయ్య నల్లజాల శ్యామ్ చింత దుర్గారావు సీతాపురం శ్రీ సీతరామచంద్ర స్వామి వారి ఆలయ అర్చకులు ఏసు పాక వెంకటేశ్వర్లు ఎర్ర నరసింహారావు మాదిరెడ్డి మధు గణేష్ మాడుగుల కాసులు గాడిద చిన్న నాగమ్మ గాడిద పకీరమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి

# నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా తాజా మాజీ సర్పంచ్ ల ఆందోళన.


# ఎంపీడీఓలకు వినతిపత్రాలు.

నర్సంపేట,నేటిధాత్రి :

గత సర్పంచులకు పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నర్సంపేట డివిజన్ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల ముందు సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి,నర్సంపేట,నెక్కొండ,చేన్నారావుపేట,ఖనాపురం,నల్లబెల్లి మండలలో అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల ముందు ఆందోళన నిర్వహించి సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయా మండలాల
ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందజేశారు.దుగ్గొండిలో మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ గౌడ్,నల్లబెల్లిలో మాజీ సర్పంచ్ నానెబోయిన రాంజారం,నర్సంపేటలో నామాల సత్యనారాయణ,ఖానాపురంలో మాజీ ఎంపిపి వేములపల్లి ప్రకాశ్ రావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్న పార్లమెంటు ఎన్నికల ముందు సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ మాజీ ప్రజాప్రతినిధులకు,సర్పంచులకు, గ్రామపంచాయతీలకు నేటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని
అవేదన వ్యక్తం చేశారు.గ్రామాలలో ఐదు సంవత్సరాలుగా సేవ చేసి అభివృద్ధి చేసి ఆర్థికంగా చిదిగిపోయిన మమ్మల్ని వేధింపులకు గురి చేయకుండా తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. లేనిచో భవిష్యత్తులో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా అడ్డుకుంటామని అలాగే రాష్ట్రస్థాయిలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమా నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమాలలో అన్ని మండలాల మాజీ ప్రజా ప్రతినిధులు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా యన్మన్ గండ్ల లో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం యన్మన్ గండ్ల గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో గురువారంరోజు చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంగం నాయకులు చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ అమెను స్పూర్తి గా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు.. ఈకార్యక్రమంలో కండక్టర్ భీమయ్య, చెలిమే శేఖర్, సి.యాదయ్య,సి.బాలరాజ్, సి. ఆంజనేయులు,సి. లక్ష్మయ్య, చెలిమే. ఆంజనేయులు, చెలిమే వేణుగోపాల్,సి. వెంకటేష్,సి. నాగరాజు సి. రవి, కొనింటి. శంకరయ్య, రామాంజనేయులు, గోపాల్,తదితరులు పాల్గొన్నారు.

దళిత జర్నలిస్ట్ ఫోరం చైతన్య సభ కరపత్రం ఆవిస్కరించిన ఎడవల్లి

కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎడవల్లి కృష్ణ

ప్రతి దళిత జర్నలిస్ట్ హాజరై చైతన్య సదస్సు ను జయప్రదం చేద్దాం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

దళిత జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 27న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే దళిత జర్నలిస్టుల ఫోరం చైతన్య సభను ప్రతి దళిత జర్నలిస్టు హాజరై విజయవంతం చేయాలని, దళిత జర్నలిస్ట్ ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్న కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఈదునూరి బాలకృష్ణ తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎడవల్లి కృష్ణ చేతుల మీదుగా దళిత జర్నలిస్ట్ ఫోరం చైతన్య సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మొదటి ప్రధాన కల్పించాలని, అక్రిడేషన్ కమిటీలో స్థానం కల్పించాలని, దళిత సీనియర్ జర్నలిస్టులకు నామినేట్ పోస్టులు కల్పించాలని వివిధ అంశాలపై సభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ జర్నలిస్ట్ వినోద్ కంచు శ్రీనివాస్ రమేష్ పాల్గొన్నారు.

పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీమంత్రి

కొప్పుల ఈశ్వర్

గొల్లపల్లి, నేటి ధాత్రి: తెలంగాణ ధీర వనిత, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. అనంతరం పలు గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. గొల్లపల్లి మండలంలోని చిల్వా కోడూర్ గ్రామానికి చెందిన మెడపట్ల గంగయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తిరుమలాపూర్ గ్రామానికి చెందిన పబ్బా రవీందర్ కొన్ని రోజుల క్రితం గుండె నొప్పితో మృతి చెందగా, అలాగే శ్రీరాములపల్లి గ్రామ మాజీ వార్డ్ మెంబర్ అనిల్ తల్లి తరాల్ల బుచ్చి రాజవ్వ ఆరోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించారు. రంగధాముని పల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు క్యాతం రవీందర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సేవకుడు ‘పొదెం ఆపదలో పేదలకు అండగా

గుర్తుకొస్తున్నాయ్
భద్రాచలం నేటి ధాత్రి

స్థానికుల మదిలో చెరగని ఆనాటి గురుతులు

పొదెం’ పదునైన పదం.
విలువలు నిలువెత్తు నిదర్శనం. రాజకీయ జీవితం మార్గదర్శకం. అందుకే అతను ప్రజానేత.ఆదర్శ బాట. ఆయనే గత భద్రాచలం శాసనసభ్యులు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య

2019,2020,2021లో కరోనా కల్లోలం కాలంలో ప్రజల మధ్య ఉంటూ, స్థానిక శాసనసభ్యులుగా ప్రజల బాగోగులు చూస్తూ, వారికి నిత్యవసరాలు అందించటం, 2022 జూలై వరదల సమయంలో కూడా తన వంతు సహాయం చేయటం నేటికీ స్థానికుల మదిలో చెరగని గుర్తులుగా మిగిలిపోయాయి. ప్రధానంగా కొండలు, గుట్టలు తదితర ప్రాంత ఆదివాసీల పట్ల తాను చూపిన చొరవ చేసిన సహాయం ఇప్పటికీ స్థానికులు చర్చించుకుంటుంటారు.

గెలుపోటములతో పని లేకుండా, ప్రజల మధ్య నిలబడటమే ‘పొదెం’ నికార్సైన రాజకీయ విలువలకు నిలువుటద్దం.

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి :

భూమి కోసం,భూక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 129 వ జయంతి సందర్బంగా భారతీయ రజక సంఘం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆమె విగ్రహనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా కార్యక్రమ ముఖ్య అతిథిలుగా హాజరైనటువంటి డాక్టర్ పి గోపాల్, బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, మరియు బిజెఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు తడిగొప్పుల మల్లేష్ మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ పోరాట విల్లంబై, అలుపెరుగని ఆయుధమై కదిలిన ధీరవనిత ఐలమ్మ అని అన్నారు.దొరల పెత్తందారుల గుండెలపై సింహ స్వప్నమై,గర్జించిన ఐలమ్మ మహిళా లోకానికి చైతన్య స్ఫూర్తి అని పేర్కొన్నారు.నిరంతరం మార్పుకోసం పనిచేసి తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి ఆదర్శమైన వ్యక్తిగా ఉన్నతమైన ఆశయాల కోసం ఉద్యమిస్తూ ఎంతోమందికి అండగా నిలిచిందని వారు అభివర్ణించారు.ప్రజలను రైతులను ,సంఘటిత పరచి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుల నాయకత్వ అండతో కదులుతున్న సందర్భంలో, దొరల అహంకార అరాచకాలను అడ్డుకొని విముక్తి కలిగించాలని సాయుధ పోరాటానికి చాకలి ఐలమ్మ నడుము కట్టి ముందు వరుసలో నడిచిన వీరనారి అమే అని అన్నారు.
భవిష్యత్ తరాలకు నిత్య స్ఫూర్తి దాయకంగా నిలిచిన విప్లవ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట భారతీయ రజక సంఘం అధ్యక్షులు కొల్లూరు లక్ష్మీనారాయణ , పుట్టపాక రవి ,చౌడారపు మధు, సాంబరాతి మల్లేశం , తడిగొప్పుల ప్రవీణ్, మామిడాల నరసయ్య, రాయరాకుల శ్రీను, చింతాం విజయ రాణి, కందిపల్లి శంకర్ , మేకల రాజకుమార్ , జెట్టబోయిన రాజు ,పొదిల రామచందర్, దిలీప్, మామిడాల బిక్షపతి ,మరియు నర్సంపేట బారాకులం అధ్యక్షులు ఐలోని శ్రీనివాస్, గుడికందుల సదానందం, కొల్లూరి శ్రీహరి, కొల్లూరి మధుకర్ ,తడిగొప్పుల రణధీష్ ,నెల్లుట్ల శివ, ప్రవీణ్, నరేష్ , రాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీకళాశాలలో చాకలి ఐలమ్మ జయంతి

నివాళులు అర్పించిన ప్రిన్సిపాల్,అధ్యాపక సిబ్బంది

పరకాల నేటిధాత్రి
చాకలి పొలమ్మ జయంతిని పురస్కరించుకుని గురువారం రోజున చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.సంతోష్ కుమార్ సిబ్బంది ఐలమ్మ చిత్రటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణాలో జమీందారుల, భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాలను ఎదురించిన వీరవనిత,తెలంగాణాధిక్కెరస్వరం చాకలి అయిలమ్మ అని విద్యార్థులు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని అవినీతి,ఆక్రమాలపై పోరాడాలని పలుపునిచ్చారు. అలాగే నాటి కాలంలో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉండేదని పంట పండించి రైతుల దగ్గర నుండే విస్నూరు రామచంద్రరెడ్డి అక్రమంగా ధాన్యాన్ని ,పన్నులను వసూలు చేసేవారని,వీరికి అప్పటి పట్వారిలుమద్దతులుగా నిలిచే వారని వీరందరిపై కొడవలి చేతపట్టి పెత్తందార్లను ఎదిరించిన వీరనారీ చాకలి ఐలమ్మ అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆకాడమిక్ కో ఆర్డినీటర్ డాక్టర్ ఎన్.మల్లయ్య,స్టాఫ్ సెక్రెటరీ డాక్టర్ బి.విజయ్ పాల్ రెడ్డి,అధ్యాపకులు,కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్న నిషేధిత మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు

గుండాల సిఐ రవీందర్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :


మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా మండలంలోని దామెర తోగు గ్రామాన్ని గుండాల సీఐ రవీందర్ విజిటింగ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఎవరైన అనుమానితులుగా కొత్త వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం
అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లును గోప్యంగా ఉంచుతా
మన్నారు. నిషేదిత మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించి
ఇబ్బందులకు గురికావద్దని హెచ్చరించారు. కాలం చెల్లిన సిద్ధాంతాలను నమ్ముకుని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని జన జీవన స్రవంతిలో కలిస్తే పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని, తమ కుటుంబాలతో ఆనందంగా జీవించవచ్చని తెలిపారు. మావోయిస్టుల మాయమాటలు నమ్మి నిండు జీవితాలను అర్ధంతరం చేసు
కోవద్దని పిలుపునిచ్చారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని మావోయిస్టులు తమ ఊబిలోకి దించుతూ వారి స్వలాభం కోసం అమయాకులను బలికొంటున్నారన్నారు. నిరుద్యోగులకు పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న మావోయిస్టులను తరిమి కొట్టాలని అన్నారు.అదేవిధంగా వారోత్సవాల కల్వర్ట్స్ ను కూడా తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో సివిల్ పోలీస్ సిబ్బంది మంగయ్య, వెంకటేశ్వర్లు, స్పెషల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కి వినతి పత్రం అందజేసిన డిజెఎఫ్ నాయకులు

శ్రీరాంపూర్, (మంచిర్యాల )నేటి ధాత్రి:

డిజెఎఫ్ యూనియన్ కార్యాలయం కొరకు గురువారం రోజున శ్రీరాంపూర్ సింగరేణి జిఎం సంజీవరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసిన డిజెఎఫ్ నాయకులు సానుకూలంగా స్పందించిన జిఎం సంజీవరెడ్డి ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ జిల్లా కోశాధికారి చొప్పదండి జనార్ధన్, మెరుగు సతీష్, పులి మధునేష్, నేరెళ్ల నరేష్ గౌడ్ ఉన్నారు.

జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు బిట్స్ విద్యార్థుల ఎంపిక

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన ఎస్జిఎఫ్ఐ మండల స్థాయి క్రీడోత్సవాలలో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థులు అండర్ 14 మరియు అండర్ 17 విభాగంలో కబడ్డీ,ఖో ఖో క్రీడలలో 11 మంది విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ పిండి యుగేందర్ తెలియజేశారు.ఎంపికైన విద్యార్థులకు పాఠశాల చైర్మన్ డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ,క్రీడల ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణతో కూడినటువంటి జీవనం, మానసిక శారీరక ఉద్దీపనలను అందిస్తాయని,ఆటలు విద్యాపరమైన అనుకరణ లేదా మానసిక పాత్రను నిర్వహించడానికి తోడ్పడతాయని తెలియజేశారు.

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు

గంగాధర నేటిధాత్రి :

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గంగాధర లో చాకలి ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రిన్సిపాల్ ఏ. సత్యనా రాంజనేయ మాట్లాడుతూ సాకలి ఐలమ్మ గారి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, తెలంగాణ ఖ్యాతిని తెలంగాణ పోరాట పటిమను ప్రపంచానికి తెలియజేసిన వీర మహిళా చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
అనంతరం ఎన్ఎస్ పి.ఓ.(NSS P.O)
ఎల్. సురేష్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం పేదల విముక్తి కోసం పోరాటం సలిపిన మహా వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు అనేక మంది స్త్రీలను మేల్కొల్పి దున్నేవారికి భూమి దక్కాలని, సమాజంలో అసమాన తలను తొలగించాలని తన జీవితకాలం ఉద్యమం కొనసాగించారు. ఆమె అందించిన పూర్తి సహకారం నేటి మహిళా లోకానికి ఎంతగానో తోడ్పడుతుందని, చాకలి ఐలమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు నడవాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

జర్నలిస్ట్ బండి రవిని పరామర్షించిన నాయకులు

నేటిధాత్రి, దేశాయిపేట

గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఎనుమాముల ప్రాంతానికి చెందిన సీనియర్ రిపోర్టర్ (టీవి5) బండి రవి తండ్రి బండి కుమారస్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, గురువారం 14వ డివిజన్ కు చెందిన ఎన్టీఆర్ నగర్, ఎస్ ఆర్ నగర్, సుందరయ్య నగర్ కు చెందిన వివిధ పార్టీల నాయకులు బండి రవితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బండి రవిని పరామర్శించిన వారిలో వివిధ పార్టీల నాయకులు ముడుసు నరసింహ, కేతిరి రాజశేఖర్, ఈర్ల రాజేందర్, కొత్తకొండ రాజు, పసులాది మల్లయ్య, ఉప్పునూతల రాజు, అంకేశ్వరపు సతీష్, తదితరులు ఉన్నారు.

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న మోడీ ప్రభుత్వం

సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా

భూపాలపల్లి నేటిధాత్రి

దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ప్రజల్లో చీలిక తీసుకువస్తూ మతతత్వ రాజకీయాలను పెంచి పోషిస్తుందని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజు అన్నారు.

జిల్లా కేంద్రంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగిన సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా సదస్సుకు పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అధ్యక్షత వహించారు.
ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా పాల్గొని మాట్లాడుతూ.
దేశ రాజకీయాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బిజెపి ప్రభుత్వం గౌరవించడం లేదని ప్రజల హక్కుల్ని నిరాకరిస్తుందని సామ్రాజ్యవాదులకు దాసోహమై పరిపాలన చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలోనూ మద్దతు శక్తుల ప్రమాదం జరిగిందని అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే దానికి నిదర్శనం అన్నారు. బిజెపి ఎదుగుదలకు బిఆర్ఎస్ పార్టీ అనుసరించిన విధానాలు ఉపయోగపడ్డాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ అనుసరించిన ఆర్థిక విధానాలను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తుందని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం యువత నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజలు తిరస్కరించే అవకాశం ఉందన్నారు. తెలంగాణ అంటేనే కమ్యూనిస్టులు, గుర్తుకు వస్తారని అలాంటి ఈ గడ్డపై వామపక్ష శక్తులు బలహీన పడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కమ్యూనిస్టులు బలోపేతం కావాలని, లిబరేషన్ ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆ విధమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్లాలని రమేష్ రాజా అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసే చర్యలు మానుకోవాలని ప్రజా అనుకూల పరిపాలన చేయాలని ఏఐసీసీటియు రాష్ట్ర కార్యదర్శి రొయ్యల రాజు అన్నారు. స్వరాష్ట్ర ఏర్పడి పదేళ్ల కాలం పూర్తయిందని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్టపరిచిందని, సుమారుగా 8 లక్షల కోట్ల అప్పు పెరిగిందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయకూడదని, రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బిజెపి ప్రమాదాన్ని ప్రజా పోరాటాల ద్వారా అడ్డుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
ఈ సమావేశంలో జిల్లా నాయకులు చంద్రగిరి శంకర్, ప్రజా సంఘాల నాయకులు శీలపాక నరేష్, రవి, రాకేష్, ప్రకాష్, రాము, లక్ష్మణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు

పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ కు నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించరు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… తెలంగాణ ఉత్పకారిణి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్రా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. చాకలి ఐలమ్మ జయంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న జరుపుకుంటారు. చాకలి ఐలమ్మ తెలంగాణా ప్రాంతంలో జాతిపరమైన విముక్తి పోరాటంలో ప్రముఖంగా నిలిచిన మహిళా నాయకురాలు. ఆమె తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో, జమీందారీ వ్యవస్థ మరియు నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, సామాజిక న్యాయం కోసం ప్రతీకగా నిలిచారు.
ఆమె జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటూ, ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటారు, ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో, మహిళా సాధికారత మరియు సామాజిక న్యాయం కోసం ఆమె అందించిన కృషిని గుర్తు చేసుకుంటారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, ఆర్ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీసీఆర్ బీ డీఎస్పీ రమణా రెడ్డి, ఎ ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, వర్టికల్ డీఎస్పీ సుదర్శన్, ఎస్ బి ఇన్స్పెక్టర్ శివ కుమార్, ఆర్ ఐ.కృష్ణయ్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

జమ్మికుంట:నేటిధాత్రి

జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రపరిధిలోనిఅభాదిజమ్మికుంట బి సి కాలనీలో డాక్టర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. 77మంది కి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.5 గురు జ్వర పీడితులను గుర్తించి వారికి ఆర్ డీ టి కిట్స్ ద్వారా డెంగీ మరియు మలేరియా నిర్దారణ పరీక్షలు చేసినారు.అదేవిధంగా డాక్టర్ చందన ఆధ్వర్యంలో జమ్మికుంట కృష్ణాకాలనీ లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమములో భాగంగా వైద్య శిబిరం నిర్వహించి నారు. శిబిరం నకు వచ్చిన 63 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసినారు. 3 గురు జ్వర పీడితులకు రక్త నమూనాలను సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకొరకు ల్యాబ్ కి పంపించినారు. అదేవిధంగా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే సందర్భముగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల మరియు అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలో వైద్య శిబిరాలు, స్వచధనం పచ్చదనం, శ్రమధానం, మొక్కలు నాటడం కార్యక్రమాములను నిర్వహించడం జరిగినది. పర్యావరణ పరిరక్షణ మరియు ప్లాస్టిక్ నిషేధం అవగాహన కల్పించడం జరిగింది. సీజనల్ వ్యాధుల పై, వ్యక్తి గత పరిశుభ్రత పై మరియు పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించనైనది. ఈ కార్యక్రమాలలో డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ చందన, డాక్టర్ హిమబిందు, డాక్టర్ ఫర్హానుద్దీన్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్ వైజర్స్ అరుణ, రత్న కుమారి, రామక్రిష్ణ ల్యాబ్ టెక్నీషియన్, శ్రీధర్ ఫార్మసిస్ట్, సాయికుమార్ స్టాఫ్ నర్స్, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, Anms సరళ, సజీదాపర్వీన, రమ, వాణిశ్రీ మరియు ఆశకార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు

జమ్మికుంట నూతన ఎంఈఓ కు ఘనసన్మానం.

జమ్మికుంట: నేటి ధాత్రి

జమ్మికుంట మండల విద్యాధికారి గా బాధ్యతలు తీసుసుకున్న శ్రీమతి మంతెన.హేమ లత ను ఎస్ టి యు జమ్మికుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రజాక్ పాషా ప్రధానకార్యదర్శి పురుషోత్తం మూర్తి, అదనపు ప్రధానకార్యదర్శి శ్రీ కోట శ్యామ్ కుమార్ , జిల్లా నాయకులు శెట్టి రాజమౌళి,దేవునూరి రఘు , మండల అసోసియేట్ అధ్యక్షుడు శ్రీ మెడుదల నాగరాజు, నాయకులు కుర్ర సమ్మయ్య, లోకిని తిరుపతి, శ్రీనివాస్,మహేందర్,తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ సేవలు మరువ లేనివని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్అన్నారు.
గురువారంచండూరు మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ జయంతిని సిపిఎం చండూరు మండల కమిటీ ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరల పెత్తందారులకు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు.చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో చాకలి ఐలమ్మ జన్మించారు అని, పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో అయిలమ్మకు బాల్య వివాహం జరిగిందని ఆయన అన్నారు.వీరిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడం, వీరి కులవృత్తిగా చాకలి వృత్తిని నిర్వహించేవారని ఆయన అన్నారు.. 1940 నుండి 1944 కాలంలో విసునూర్ దేశ్ముఖ్ మరియు రజాకార్లకు వ్యతిరేకంగా ఎర్ర జెండా పట్టింది చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు.. అగ్రకులాల స్రీలు వారిని కూడా దొర అని పిలిపించుకునేవారి వారి సంస్కృతికి చరమగీతం పాడారు అయిలమ్మ అని, ఈభూమి నాది పండిన పంట నాదని, దొర ఎవ్వడు అని, నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి దక్కించుకోగలర ని ఆయన అన్నారు. ఆనాడు చాకలి ఐలమ్మ విష్ణుర్ దేశ్ముఖ్, రాపాక రామచంద్రారెడ్డిల గూండాలను కొంగు నడుముకు చుట్టి కొడవలి చేత బట్టి తరిమికొట్టారని ఆయన అన్నారు.జనగామ తాలూకా ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఆంధ్ర మహాసభలను పెట్టి ఎర్రజెండా చేపట్టి దొరల ఆధిపత్యాన్ని ఊరూరాచాటి చెప్పారనిఆయన అన్నారు. తెలంగాణ తొలి దశ స్వాతంత్ర పోరాటంలో, భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అనివారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులుకట్ట లింగస్వామి,సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య,వెంకటేశం,సిపిఎం నాయకులుఈరటి వెంకన్న, హమాలి యూనియన్ నాయకులు కావలి వెంకన్న, పుల్కరం అంజయ్య, శేఖర్, జగన్, బొమ్మర గోని లింగస్వామి, కుమార్, పుల్కరం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీ, పోలీస్ స్టేషన్ రోడ్డు, ఎమ్మార్వో రోడ్డులో టీయూఎఫ్ఐడిసి నిధులతో ఫేజ్ 5 కింద సుమారు రూ.140 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జెడ్పి సీఈఓ, జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) విజయలక్ష్మి తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపనలు చేశారు. రూ.30 లక్షలతో కారల్ మార్క్స్ కాలనీ లో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా, రూ. 50 లక్షలతో పోలీస్ స్టేషన్ రోడ్డులో రోడ్డుకిరువైపులా సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చివరగా, రూ.60 లక్షలతో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుండి ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డులో బీటీ రోడ్డు వైడనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ తో పాటు, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. సదరు గుత్తేదారు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ వెంక రాణి సిద్దు వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ రెడ్డి 24 వ వార్డు కౌన్సిలర్ శిల్ప అనిల్ దాట్ల శ్రీనివాసు కో ఆప్షన్ సభ్యుడు ఇర్ఫాన్ అశోక్ పలువురు అధికారులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

బయ్య స్వామి దంపతులకు స్వదేశాగమన శుభాకాంక్షలు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాశీబుగ్గ మాజీ కార్పొరేటర్లు బయ్య రాజ్యలక్ష్మి – స్వామి దంపతులు, స్వల్ప విరామం నిమిత్తం నాలుగు నెలలు అమెరికాలో ఉన్న తమ కుమారుడు మధుబాబు వద్దకు వెళ్లి చికాగో, వాషింగ్టన్, కాలిఫోర్నియా మొదలగు రాష్ట్రాలలోని ముఖ్యమైన పర్యాటక స్థలాలను సందర్శించి అమెరికా యాత్రను విజయవంతంగా ముగించుకొని తిరిగి నేడు మాతృదేశానికి విచ్చేయుచున్న సందర్భంగా వారికి ఫోన్ ద్వారా స్వదేశాగమన శుభాకాంక్షలు తెలియచేసిన వరంగల్ ఎనుమాముల మార్కెట్ దడువాయి యూనియన్ నాయకులు కందికొండ రాజేందర్, నేటిధాత్రి పత్రిక వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ కందికొండ గంగరాజు. ఈ నెల 28, శనివారం ఉదయం బయ్య స్వామి దంపతులు ఇండియాకు వస్తున్న సందర్భంగా పలువురు నాయకులు, వ్యాపారవేత్తలు, వివిధ పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఫోన్ చేసి స్వదేశాగమన శుభాకాంక్షలు తెలియచేశారు.

error: Content is protected !!
Exit mobile version