పద్మశాలీలు చైతన్యంగా ఉంటేనే గుర్తింపు

పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలి…

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వేముల బాలరాజు నేత…

రఘునాథపల్లి.( జనగామ) నేటి ధాత్రి :-

పద్మశాలి కులస్తులు చైతన్యంగా ఉంటేనే భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించవచ్చని పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీలు పద్మశాలి కులస్తులకు అవకాశం కల్పించాలని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల బాలరాజు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల్లో పద్మశాలీలు అత్యధికంగా ఉన్న స్థానాల్లో అవకాశం కల్పించాలని అన్ని పార్టీలకు కోరడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీలు ఏర్పాటుతోపాటు సంఘం బలపేతానికి కృషి చేస్తామని ఆయన వివరించారు.బడ్జెట్ సమావేశంలో పద్మశాలి కార్పొరేషన్ కు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం 25 వందల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పద్మశాలి కార్మికులు గుర్తింపు కార్డులతో పాటు వారికి బ్యాంకు రుణాలు. అందించే ఆదుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర నాయకులు సామల పరమేశ్వర్, క్యామ వెంకటరమణ, పరికిపండ్ల అశోక్, గద్దె వెంకటరామయ్య.. జనగామ జిల్లా ప్రచార కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version