నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో, పెద్ద ఎత్తున పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా వరంగల్ తూర్పు, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఎచ్ఓ గా పి. మల్లయ్య వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న సురేష్ ను బదిలీల్లో బాగంగా ఐజి కి అటాచ్ చేశారు. మిల్స్ కాలనీ ఎస్ఎచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం వరంగల్ ఏసిపి కిషన్ ను మర్యాదపూర్వకంగా కలిసి బోకే అందచేశారు.