సంవత్సరాలుగా సివిల్ సప్లై రేషన్ బియ్యం తూకంను మరిచి పోయింది.!?

ఇప్పుడు సివిల్ సప్లై డిఎం ఆగ్రహం తో డీలర్లకు జోకి ఇస్తాం అన్న జిసిసి.!?

గ్రేట్ వన్ కాంట్రాక్టర్ ఎంఎల్ఎస్ సివిల్ సప్లై అధికారులు రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్టు కాదా.!?

సంవత్సరాలుగా రేషన్ బియ్యాన్ని తూకం వేయకుండా ఇవ్వకపోవడంతో నష్టపోయిన ప్రజలకు డీలర్లకు సమాధానం ఎవరు చెప్పాలి.!?

గ్రేట్ వన్ గ్రేట్ టు కాంట్రాక్టర్లతోపాటు కోత పేరుతో జిసిసి ఎంఎల్ఎస్ కేంద్ర నిర్వాహకులపై చర్యలు ఉండవా.!?

తక్షణమే కమిషనర్ సివిల్ సప్లై ఫుడ్ కమిషన్ ఆఫ్ తెలంగాణ రేషన్ బియ్యం సరఫరాలు సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమాలపై చర్యలకు ఆదేశించాలి.!

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

ఎట్టకేలకు పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం లో కోత పేరుతో వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని గ్రేడ్ వన్ గ్రేట్ టు కాంట్రాక్టర్లతోపాటు సివిల్ సప్లై అధికారులు జిసిసి ఎంఎల్ఎస్ కేంద్ర నిర్వాహకులతో కుమ్మక్కు అనేక సంవత్సరాలుగా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం కోత విధిస్తూ ఇన్ని వేల కింటన్లు పక్కదారి పట్టించారు ఎవరికి తెలవదు. ఇట్టకేలకు రేషన్ బియ్యం సరఫరాలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతున్నాయని తిరుపతికి తీసుకురావడం కొద్ది రోజుల్లోనే అనేక మార్పులు రావడం విశేషం. సుమారు ఒక లారీకి 600 బస్తాల్లో ఐదు క్వింటర్ల వరకు తరుగు రావడం ఇలా గత కొన్ని సంవత్సరాలుగా గ్రేడ్ వన్ గ్రేట్ టు సివిల్ సప్లై అధికారులు కలిసి ఎంఎల్ఎస్ కేంద్ర నిర్వాహకుల సహకారంతో డీలర్లకు బెదిరింపులు ప్రశ్నించిన డీలర్ల పై కేసులు నమోదు చేస్తూ సంవత్సరాలుగా లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడం జరిగింది అన్న విషయం స్వయంగా ఈరోజు ఎంఎల్ఎస్ కేంద్రం నుండి ప్రజా పంపిణీ వ్యవస్థలో అందించే రేషన్ బియ్యానికి తూకం వేసి తీసుకువెళ్లాలని సామాజిక మద్యం ద్వారా తెలపడం మరోవైపు సివిల్ సప్లై డిఎం ఆగ్రహించడం జరిగిన అనంతరం తూకం వేసి రేషన్ డీలర్లకు ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలకు బియ్యాన్ని తరలించడం జరుగుతుందని చెప్పడం ప్రస్తుతం సంతోషకరమైనప్పటికీ, అనేక సంవత్సరాలుగా లక్షల రూపాయల రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారు అన్న విషయం సివిల్ సప్లై జిసిసి కాంట్రాక్టర్లు కలిసి దోపిడి చేశారు అని ఒప్పుకుందని స్పష్టం అవుతుంది.

సంవత్సరాలుగా సివిల్ సప్లై రేషన్ బియ్యం తూకంను మరిచి పోయింది.!?

ప్రజా పంపిణీ వ్యవస్థలో సివిల్ సప్లై అధికారులు రేషన్ బియ్యానికి తూకం వేయడం సుమారు ఐదు ఆరు సంవత్సరాల నుండి మహదేవ్పూర్ ఎం ఎల్ ఎస్ కేంద్రంలో తూకం అనే విషయాన్ని మర్చిపోవడం జరిగింది. కేవలం సంవత్సరాలుగా గ్రేట్ వన్ కాంట్రాక్టర్ తీసుకువచ్చిన లారీని గ్రామాల్లో తరలించుటకు గ్రేటు కాంట్రాక్టర్ వాహనంలో నేరుగా బస్తాలను డీలర్ కు 50 బస్తాలు అనే విధంగా నేరుగా మరో లారీల్లో లోడ్ చేయడమే తప్ప జిసిసి ఎం ఎల్ ఎస్ కేంద్రంలో రేషన్ బియ్యానికి తూకం వేసిన దాఖలా లేదు. సివిల్ సప్లై అధికారుల ఆదేశాలతో ప్రతి లారీలో ఐదు నుండి 6:00 వరకు రేషన్ బియ్యం బస్తాల్లో కోత ఉందన్న విషయం గ్రేట్ వన్ టూ కాంట్రాక్టర్లకు అలాగే గోదాం జిసిసి నిర్వాహకునికి రేషన్ బియ్యం తో పాటు సన్న బియ్యం కూడా పెద్ద మొత్తంలో తరుగు సంచుల్లో ఉందన్న విషయంతో బయటికి పడకుండా డీలర్లకు 6a కేసు నమోదు చేస్తామని బెదిరిస్తూ నేటి వరకు కొనసాగించడం జరిగింది. వరంగల్ సి డబ్ల్యూ సి తోపాటు ఇతర గోదాముల నుండి మహదేవ్పూర్ ఎంఎల్ఎస్ గోడౌన్ కు వచ్చే ప్రతి లారీలో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం సంచులు కోతతో ఉంటాయన్న విషయం తెలిసి ఉండి రికార్డులు మాత్రం తంబి వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు లేకుండా సంవత్సరాలుగా రేషన్ బియ్యాన్ని పక్కదారి పడుతూ లక్షల రూపాయలను సొమ్ము చేసుకోవడం జరిగింది. అనే వాస్తవం నేడు తూకంతో రేషన్ బియ్యం సరఫరా చేస్తామని చెప్పడమే సాక్ష్యం.

ఇప్పుడు సివిల్ సప్లై డిఎం ఆగ్రహం తో డీలర్లకు జోకి ఇస్తాం అన్న జిసిసి.!?

సంవత్సరాలుగా లేనిది బియ్యంకు ఇప్పుడు ఎందుకు తూకంపై ఆగ్రహించాల్సి వచ్చింది. ఇన్ని రోజులుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం తో పాటు సన్నబియానికి తూకం వేసి ఇవ్వడం లేదన్న విషయం సివిల్ సప్లై డిఎం కు తెలవదా, ఒకవేళ తెలవకుంటే తక్షణమే రూట్ ఆఫీసర్లను నియమించే విధంగా ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు, ఇన్ని రోజులుగా తూకం వేయకుండా రేషన్ బియ్యం సరఫరా ఇలా చేశారు వాటికి సంబంధించిన అధికారుల పై ఎందుకు చర్యలకు ఆదేశించలేదు, గ్రేట్ వన్ గ్రేట్ టు కాంట్రాక్టర్లు సిడబ్ల్యుసి గోదాం నుండి తీసుకువచ్చే రేషన్ బియ్యం యొక్క నిలువ వివరాలు ఇప్పటివరకు ఎందుకు తీసుకోలేదు అనేక అనుమానాలు తేరుపతికి రావడం జరుగుతుంది. దీనన్నిటికీ సమాధానం ఒక్కటే తూకం పేరు లేకుండా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం కూత విధిస్తూ సివిల్ సప్లై అధికారులు కాంట్రాక్టర్లు జిసిసి ఎంఎల్ఎస్ గోదాం నిర్వాహకులు అంతా కలిసి సంవత్సరాలుగా దోచుకున్నారని నేటి ధాత్రి సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా లక్షల రూపాయలను కోత పేరుతో దోచుకుంటున్నారని ఇతర పైకి తీసుకురావడంతో ఇప్పుడు డిఎం సివిల్ సప్లై కు తూకం అనే విషయం గుర్తుకొచ్చింది. కానీ దీనికి సంబంధించిన విచారణ అధికారులపై చర్యలు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం లేదా పరోక్షంగా సహకారం పై విచారణకు ఆదేశం చర్యలు అనే అంశం మాత్రం డిఎంకు గుర్తుకు రాలేదు. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి రేషన్ బియ్యం సరఫరాలో తూకం వేసి అందించాలని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టమవుతుంది.

గ్రేట్ వన్ కాంట్రాక్టర్ ఎంఎల్ఎస్ సివిల్ సప్లై అధికారులు రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్టు కాదా.!?

ఇన్ని రోజులుగా గుర్తుకురాంది తూకం ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది గ్రేట్ వన్ కాంట్రాక్టర్ ఎం ఎల్ ఎస్ గోడౌన్ సిసి సివిల్ సప్లై అధికారులు అంతా కుమ్మక్కై అనేక సంవత్సరాలుగా ఆన్లైన్ తంబింగ్ లో మాత్రం తూకానికి సంబంధించి డీలర్లు అలాగే ఇతర ప్రభుత్వ బాధ్యులచే తంబింగ్ చేసుకుని అవినీతి జరగలేదని ఉన్నత అధికారులకు రికార్డు అందించడం జరిగిందే తప్ప డీలర్లకు ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలకు అందించిన రేషన్ మరియు సన్న బియ్యం లో పెద్ద మొత్తంలో కోత ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి తూకం వేసి బియ్యం అందించడం జరుగుతుందన్న విషయం మాత్రం అధికారులకు గాని లేక సివిల్ సప్లై ఫుడ్ కమిషన్ లకు మాత్రం సమాచారం అందించిన దాఖలాలు లేవు. ఇన్ని సంవత్సరాలుగా తూకం వేయకుండానే కేవలం లారీ నుండి లారీ లో లోడ్ చేస్తూ తరలించిన రేషన్ బియ్యం తో పాటు సన్న బియ్యం ఏన్ని లక్షల కింటన్న తరుగు కావడం జరిగింది. వాటికి భర్తీ ఏ విధంగా చేస్తారు అనేకమంది ఐదు మండలాలకు సంబంధించిన డీలర్లు లెక్కలేనంత సార్లు తమకు బియ్యం కూత వచ్చిందని అనేక ఇబ్బందులు పడుతున్నామని మొరపెట్టుకున్న పట్టించుకోని సివిల్ సప్లై ఇన్ ఎల్ ఎస్ జి సి సి ఈరోజు ప్రతి డీలర్ కు ఇతర ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలకు తూకం వేసి మీకు బియ్యం అందించడం జరుగుతుందని చెప్పడం చూస్తే ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని వేల కింటల్లా రేషన్ బియ్యం పక్కదారి పట్టిందో అర్థమవుతుంది.

సంవత్సరాలుగా రేషన్ బియ్యాన్ని తూకం వేయకుండా ఇవ్వకపోవడంతో నష్టపోయిన ప్రజలకు డీలర్లకు సమాధానం ఎవరు చెప్పాలి.!?

సంవత్సరాల తరబడి ఎంఎల్ఎస్ కేంద్రం నుండి కేవలం సంచుల లెక్కతోనే డీలర్లకు అందించిన రేషన్ బియ్యం లో వేల కిలోల రేషన్ బియ్యం కోతకు గురికావడం జరిగింది. ప్రభుత్వ సొమ్మును కార్ చేసినటువంటి అధికారులకు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అలాగే గోదాం ఇన్చార్జిలపై చర్యలు అనేది ఉండవా, అనేక ఇబ్బందులు పడుతూ నేటి వరకు ప్రశ్నించకుండా ఇటు రేషన్ డీలర్లు అలాగే ప్రభుత్వ పాఠశాల వసతి గృహాలు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన నిర్వాహకుల ఇబ్బందులకు ఎవరు బాధ్యులు. రేషన్ బియ్యం కూతతో అనేక ఇబ్బందులు పడి సంవత్సరాలుగా గట్టెక్కించుకుంటూ ప్రజలకు సమాధానం చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఆ డీలర్ల పరిస్థితి అలాగే రేషన్ బియ్యం తక్కువ వచ్చిన నూరు విప్పకుండా వచ్చిన బియ్యాన్ని స్వీకరించిన ఆ పేద ప్రజలకు ఎవరు సమాధానం చెప్పాలి. సివిల్ సప్లై అధికారులు కాంట్రాక్టర్ తో పాటు ఎం ఎల్ ఎస్ జిసిసి నిర్వాహకుల కు మాత్రం కష్టాలు కాదు లాభాలే తెచ్చిపెట్టాయి ప్రభుత్వ సొమ్మును అడ్డగోలుగా దోచుకున్న వారిపై ఎవరు చర్య తీసుకోవాలని ఇది సివిల్ సప్లై ఉన్నత అధికారులు ఆలోచించాల్సిన విషయం.

తక్షణమే కమిషనర్ సివిల్ సప్లై ఫుడ్ కమిషన్ ఆఫ్ తెలంగాణ రేషన్ బియ్యం సరఫరాలు సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమాలపై చర్యలకు ఆదేశించాలి.!

భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ సబ్ డివిజన్ పరిధిలో ఎం ఎల్ ఎస్ కేంద్రం జిసిసి ఆధ్వర్యంలో నిర్వహించబడే గోదాము నుండి 5 మండలాలకు సంబంధించిన రేషన్ డీలర్లతోపాటు ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలు అంగన్వాడీ కేంద్రాలకు తరలించిన రేషన్ బియ్యానికి సంబంధించి గత ఏడు సంవత్సరాలుగా తూకం వేయకుండా కేవలం బస్తాలతోనే రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తూ ఒక్క బస్తాలు సుమారు నాలుగు నుండి 6 కిలోల వరకు కూత విధిస్తూ తరలించిన రేషన్ బియ్యం సరఫరాలు ఒక మాఫియాగా ఏర్పడి గ్రేడ్ వన్ కాంట్రాక్టర్ తో పాటు గ్రేట్ టు కాంట్రాక్టర్ సివిల్ సప్లై అధికారులు ఎంఎల్ఎస్ తోపాటు జీసీసీ సంవత్సరాల తరబడి కోత పేరుతో లక్షల కింటల్లా రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడం జరిగిందన్న విషయం నేడు సివిల్ సప్లై డిఎం జి సి సి ఎం ఎల్ ఎస్ కేంద్రం నుండి వచ్చిన సామాజిక మాధ్యమంలో నేటి నుండి తూకం వేసి ఇస్తామన్న సమాచారమే సాక్ష్యం అని బహిర్గతమైంది. రేషన్ బియ్యం సరఫరాలో అనేక అక్రమాల్లో ప్రధాన పాత్ర తూకం అనేది నేడు తెరపైకి రావడం విశేషం. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ బియ్యం సరఫరా విషయంలో మహాదేవపూర్ కేంద్రంగా జరిగిన పెద్ద కుంభకోణ వ్యవహారంలో తక్షణమే కమిషనర్ సివిల్ సప్లై ఫుడ్ కమిషన్ ఆఫ్ తెలంగాణ విచారణకు ఆదేశించి తూకం మాఫియా పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *