రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రతినిధి (నేటిధాత్రి):
తంగళ్లపల్లి మండలం కెసిఆర్ నగర్ లో నివాసం ఉన్నటువంటి వికలాంగులు అందరూ కలిసి ఒక సొసైటి గా ఏర్పడ్డారు. ఈ సొసైట్ లో 125 కుటుంబాల దివ్యాంగులు ఉన్నారు. కెసిఆర్ దివ్యాంగుల పెన్షన్ 3016/- నుండి 4016/- రూపాయలు పెంచినందుకు. అలాగే డబుల్ బెడ్ రూం 5% రిజర్వేషన్ ప్రకారం మా అందరికి ఇళ్లు అందేలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు దివ్యాంగులు అందరి తరుపున కృతజ్ఞలు తెలుపుతూ ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వారి యొక్క 125 కుటుంబాలు మద్దతు పూర్తిగా బిఆర్ఎస్ పార్టీకి తెలుపుతున్నామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో
కందుల్ నాగినాథ్ ,బాల మహేశ్,నూతి ఆయోద్య , తదితరులు పాల్గొన్నారు.
