వీణవంక :నేటిధాత్రి
వీణవంక ఎస్సై తిరుపతి
వీణవంక మండల ప్రజలకు ఈరోజు సైబర్ క్రైమ్ మరియు ఆన్లైన్ మోసాల గురించి అవగాహన రాహిత్యంగా జరిగే మోసాల గురించి వీణవంక మండల ఎస్సై ఏఎస్ఐ మరియు ఇతర సిబ్బంది అవగాహన సదస్సును పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం నందు ఎస్సై మాట్లాడుతూ పిల్లలను తగిన జాగ్రత్తలతో స్కూలుకు పంపాలి అని చెప్పడంతో పాటు వారు స్కూల్ కి వెళ్ళు సమయము వచ్చు సమయంలో అబ్జర్వేషన్ చేయగలరని తల్లిదండ్రులకు చెప్పడంతో పాటు వారి యొక్క దినచర్యలో వారు చేయు పనులను కూడా చూడగలరు మరియు మాదకద్రవ్యాలు వాడకం వలన కలిగే నష్టాలను గురించి చెప్పటం జరిగింది ముఖ్యంగా మొబైల్ వాడకంలో ఆన్లైన్ మోసాలు మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ గాని ఓటీపీలు గాని చెప్పకూడదని యువతకు మారకద్రవ్యాల నివారణకై అలాగే మారకద్రవ్యాలు ఉపయోగిస్తే శారీరకంగా మానసికంగా ఆర్థికంగా యువతకు నష్టం జరుగుతుందని తద్వారా వారిపై ఎంతో నమ్మకం పెంచుకున్నటువంటి తల్లిదండ్రులకు కూడా నష్టం జరుగుతుంది గనుక యువత మారక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్సై తిరుపతి తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతి ఏఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు
