జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లాలో రేపు అనగా 29/09/2023 రోజున వరల్డ్ హార్ట్ డే కార్యక్రమం కలదు. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎవరు హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి అవార్నేస్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది.
దీనిలో భాగంగా టచ్ హాస్పిటల్ వారు 29 వ తేదీ ఉదయం 7 గంటలకు ఐబీ చౌరస్తా నుండి మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వరకు 2k రన్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రౌండ్ లో హార్ట్ ఎటాక్ సంబంధించి ప్రివెన్షన్,రెమెడీ, వివిధ రకాల ట్రీట్మెంట్స్, సీపీఆర్ మొదలగు విషయాలను కార్డియాలజీ డాక్టర్ తెలియపరుస్తారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ & మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బాల్క సుమన్ , మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు , బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య , మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ , రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీమతి రేమా రాజేశ్వరి , ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, మోటివేషనల్ స్పీకర్ నైనా జైస్వాల్ , పుర ప్రముఖులు, అధికారులు అందరూ పాల్గొంటున్నారు.
కావున మనం అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. (అందరికి వైట్ &వైట్ టీ షర్ట్స్ అందించబడతాయి)
ఐబీ చౌరస్తాలో 29వ తేదీ ఉదయం 7 గంటలకు 2k రన్‌లో పాల్గొనవలసిందిగా అందరికీ ఇది వినయపూర్వకమైన అభ్యర్థన.