జైపూర్, నేటి ధాత్రి:
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం రోజున ఉదయం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శ్రీ వెలిచాల మల్లికార్జున స్వామి దేవాలయం సమీపంలో వానరులకు (కోతులు) పండ్ల పంపిణీ చేయడం జరిగింది. స్వచ్ఛందంగా గుడి సమీపంలో పండ్లు పంపిణీ చేసేవారు ఎవరైనా రోడ్డుకు దూరంగా అడవి ప్రాంతంలో వేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. రోడ్డు వెంట ప్రయాణించేవారు రోడ్డుపై తిను బండారాలు, పండ్లు వేయడం వల్ల తరచూ కోతులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. మీరు చేసే మంచి పనికి ప్రమాదంలో కోతులు బలైపోతున్నాయి. రామ మందిరం విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని యువ నాయకుడు గుండా సురేష్ గౌడ్ కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు నేరెళ్ల నరేష్ గౌడ్, మొగలిపాక ప్రసూన్ గౌడ్, కోమటి సంపత్ కుమార్, పాశం అజయ్, కళ్యాణపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.