మంచిర్యాల, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టి.జి.ఎఫ్.డి.సి) కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ లు గోగు సురేష్ కుమార్,ఇ.లక్ష్మణ్ లు శనివారం మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా టి.జి.ఎఫ్.డి.సి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లో చేపడుతున్న ప్లాంటేషన్ పనులను వివరించారు. అదేవిధంగా తమ టి.జి.ఎఫ్.డి.సి ద్వారా సి.ఎస్.ఆర్ నిధులతో ప్లాంటేషన్లు ఉన్న పరిసర ప్రాంత గ్రామాలలోని పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన కార్యక్రమాలను కలెక్టర్ కి వివరించడం జరిగింది. అదేవిధంగా జైపూర్ మండలం కుందారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కావాల్సిన ఫర్నిచర్ మొత్తం తమ టి.జి.ఎఫ్.డి.సి ఆధ్వర్యంలో సి.ఎస్.ఆర్ కింద మంజూరు అయిన నిధులతో సమకూర్చామని, కానీ ఈ పాఠశాల పరిధిలో త్రాగు నీటి సౌకర్యం మరియు టాయిలెట్స్ లేక టీచర్లు, విద్యార్థునీ, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి విన్నవించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ కుమార్ దీపక్ సానుకూలంగా స్పందించి సత్వరమే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.