ప్రజలతో మమేకమైనప్పుడే అధికారులకు గుర్తింపు

ఎస్సై దేవేందర్

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట ప్రజలతో మమేకమైనప్పుడే అధికారులకు తగిన గుర్తింపు లభిస్తుందని ఎస్సై దేవేందర్ అన్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ పరకాల బ్రాంచ్ లో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పని చేసిన దేవరనేని వెంకటేశ్వరరావు పదవీ విరమణ ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమం శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్ వీకేకే ఫంక్షన్ హాల్ లో జరగగా ముఖ్యఅతిథిగా ఎస్సై దేవేందర్ పాల్గొని మాట్లాడారు. ఉద్యోగరీత్యా పదవీ విరమణ ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. భారతీయ జీవిత బీమా సంస్థలో ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఉద్యోగరీత్యా పదవీ విరమణ పొందినప్పటికీ భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని అన్నారు. అనంతరం పూలమాలలు శాలువా మెమొంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ చీఫ్ మేనేజర్ బిజినెస్ నాగేశ్వరరావు రిటైర్డ్ ఎస్ బి ఎం విట్టల్ రెడ్డి రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ లు హనుమారెడ్డి సిరాజ్ ఏజెంట్లు వెన్నంపల్లి పాపయ్య బాల్ని తిలక్ బాబు తాటికొండ వీరస్వామి వడ్లకొండ భాస్కర్ నామాల రమేష్ సాంబయ్య కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version