జమ్మికుంట :నేటిదాత్రి
జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప దేవస్థానంలో ఈరోజు 26వ మండల మహోత్సవ కార్యక్రమం జరిగింది అందులో భాగంగా గడపగడపకు అయ్యప్ప రథం గ్రామం మొత్తం అయ్యప్ప అనే నినాదంతో అయ్యప్ప మాల ధరించినటువంటి భక్తులు మరియు పుర ప్రముఖులు దేవాలయ నిర్వాహకులు పాల్గొన్నారు ఈ రథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ ప్రారంభించారు అలాగే హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి పాల్గొన్నారు ప్రారంభించిన టువంటి రథం అయ్యప్ప దేవాలయం నుండి పురవీధుల గుండా అంబేద్కర్ కూడలి నుండినుండి గాంధీ కూడలి వరకు వరకు భక్తుల ర్యాలీ కొనసాగింది అంగరంగ వైభవంగా జమ్మికుంటలో అయ్యప్ప రథోత్సవం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గురు స్వాములు మాల ధారణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆలయ నిర్వాహకులు తెలిపారు
