నేటిధాత్రి, వరంగల్
గ్రేటర్ వరంగల్ 13వ డివిజన్ లోని, మౌలాలి స్కూల్లో పోషణ పక్వాడ్ కార్యక్రమం జయప్రదంగా జరిగింది. పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంగన్వాడీ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తులో ఆరోగ్యవంతంగా అన్ని పోషక విటమిన్లు పిల్లలందరికీ అందేవిధంగా చూసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలకు మరియు పిల్లల తల్లిదండ్రులకు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఎస్. విజయ, ఎస్. మేరీ, జయ, జ్యోతి, పి. కల్పన, ఓ. మేరి తదితరులు పాల్గొన్నారు.