కూకట్పల్లి మార్చి 21 నేటి ధాత్రి ఇన్చార్జి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ,100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు పూర్తి చేస్తూ,రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సమావేశంలో అమలు చేస్తున్నా రని శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీలో అందరికీ మేలు జరిగే విధంగా కొనసాగుతున్న పరిపాలన చూస్తూ, నిన్నటి వరకు భారత రాష్ట్ర సమితిలో దశాబ్దం పాటు వాటిని విడిచి పెట్టకుండా కొనసాగిన టిఆర్ఎస్ నాయకులంతా ఒ క్కొక్కరిగా కాంగ్రె స్ పార్టీలోకి చేరిపో తుండడం గమనార్హం.గురువారం రోజు 124 డివిజన్ ఆల్విన్ కాలనీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పట్వారీ శశిధర్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ అన్న వారి నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.గడచిన రాజకీయ జీవి తంలో నాతో పాటు ప్రయాణించిన బిఆర్ ఎస్ నాయకులకు,కార్యకర్తలకు,శ్రేయోభి లాషులకు ప్రత్యేకమైన ధన్యావాదాలు తెలియజేశారు.నేడు పలువురు పార్టీలో చేరినట్లు జగదీశ్వర్గౌడ్ మీడియా మిత్రు లతో చెప్పారు.