సిద్దిపేట బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అశ్వస్థకు లోనై సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 120 మంది విద్యార్థులను కలిసేందుకు వెళ్తున్న NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరిని అక్రమంగా అరెస్ట్ చేసిన సిద్దిపేట పోలీసులు
గత ఆదివారం సిద్దిపేట జిల్లా బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో అధికారులు నిర్లక్ష్యంతో వండిన కలుషిత ఆహారం తినడంతో తీవ్ర అస్యస్థకు లోనైన 120 మంది విద్యార్థులను విషయం బహిర్గతం కావోద్దనే
ఉద్దేశంతో వారి పాఠశాలలోనే ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో సోమవారం సాయంత్రం వారిని సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
సదరు బాలికలను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు హుజూరాబాద్ నుండి సిద్దిపేటకు బయలుదేరిన NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరిని సిద్దిపేట జిల్లా చిన్నకోడురు పోలీసు సిబ్బంది రామునిపట్ల స్టేజ్ వద్ద వెంకట్ బల్మూరి వాహనాన్ని బలవంతంగా అడ్డుకున్న క్రమంలో స్థానిక NSUI మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పోలీసులను నిలువరించే ప్రయత్నం చెయ్యడంతో ఒక్కసారిగా వాతావరణం రణరంగంగా మారింది.తాను కేవలం వారి ఆరోగ్య పరిస్థితిని మాత్రమే తెలుసుకునే ఉద్దేశంతో పోతున్నామని వెంకట్ బల్మూరి పోలీసులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన వినని పోలీసులు అత్యుత్సాహంతో వారిని అదుపులోకి తీసుకొని చిన్నకోడురు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.