నడి కూడ,నేటి ధాత్రి:
విద్యార్థుల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస నిర్మాణానికి దైవ స్వరూపులు, త్రిమూర్తులైన అమ్మా,నాన్న, గురువుల పాత్ర నిర్వచనీయమైందని నూతి వేణుగోపాల స్వామి అన్నారు. నడికూడ మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వందే విశ్వమాతరం కార్యక్రమంలో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహించిన అమ్మా,నాన్న, గురువు శతక పధ్యార్చన పోటీలలో ప్రశంస పత్రాలు పొందిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన స్కూల్ కాంప్లెక్స్ రాయపర్తి ప్రధానోపాధ్యాయులు నూతి వేణుగోపాల స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండే తల్లిదండ్రులకు నమస్కరించడం గురువుల పట్ల సంస్కారము కలిగి ఉండాలన్నారు. వేమన, సుమతి శతక పద్యాల్లోని విలువలను, సంస్కృతి, సంప్రదాయాలను చిన్ననాటి నుండే నేర్చుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి విద్యార్థులను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18తేదీన పది లక్షల మంది విద్యార్థులతో సామూహికంగా అమ్మా,నాన్న, గురువు శతక పద్యార్చన పోటీలు నిర్వహించిన తానా అధ్యక్షులు శృంగవరపు నిరంజన్, వందే విశ్వమాతరం చైర్మన్ తాళ్లూరి జయ శేఖర్, ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమల్ల శ్రీనివాస్ గ్రూప్ సభ్యులకు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పోలంపల్లి విజేందర్, నిగ్గుల శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ ,నందిపాటి సంధ్య, విద్యా వాలంటీర్ బాబురావు, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.