నీళ్లు ఇచ్చిన సర్కార్ కే మా మద్దతు అంటూ ప్రకటించిన పట్టణ ప్రజలు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల పట్టణంలోని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బిఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ఆరా తీశారు. తాగునీళ్లు సక్రమంగా అందుతున్నాయా కరెంటు ఇబ్బంది ఏమైనా ఉందా..రోడ్లు డ్రైనేజీ వసతి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. అవ్వను తాతలను ఆడబిడ్డలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం కొనసాగించారు. గల్లి గల్లిలో లక్ష్మారెడ్డి కి బొట్టు పెట్టి మహిళలు హారతులు పట్టారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో చేపట్టే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పథకాల గురించి వివరించారు. సౌభాగ్యలక్ష్మీ పథకం కింద గృహిణులకు నెలకు మూడు వేల రూపాయలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఇంతటి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న కేసీఆర్ సర్కార్ కి మద్దతు తెలుపాలని కోరారు. రేపు నవంబర్ 30వ తేదినా జరుగబోయే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని లక్ష మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు.