శాలువాతో ఘనంగా సన్మానించిన ….
-మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డగడ్డ భాగ్యరాజ్…
కొల్చారం,( మెదక్ )నేటి ధాత్రి:-
తూప్రాన్ పోలీస్ సిఐ రంగాకృష్ణ ను సన్మానించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్
శుక్రవారం ఉదయం తూప్రాన్ కు నూతనంగా వచ్చిన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగాకృష్ణను మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ ఆధ్వర్యంలో నాయకులు జై హనుమాన్ రియల్ ఎస్టేట్ నాయకులు ఘనంగా శాలువాతో సన్మానించి పూలమాలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ తూప్రాన్ సర్కిల్ పరిధిలో శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా విధులు నిర్వహించడానికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. తూప్రాన్ పట్టణం మనోరబాద్, శివంపేట్ , వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో పరిధిలో సర్కిల్ విభాగం మంచి పని చేసి పేరు తీసుకురావాలని సిఐ కృష్ణ గారిని సూచించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి రమేష్, తాటి విశ్వం, నాగరాజుగౌడ్, పన్నీరురాము, బలరాం రెడ్డి, తూప్రాన్ మండల ఆర్ఎంపి పి.ఎం.పి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అప్సర్ భాయ్, దొంతి యాదగిరి, డాక్టర్ ఆంజనేయులు, కిష్టాపూర్ రవి, బల్లెబోయిన మహేష్ యాదవ్, గెంట్యాల నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.