ఏ బి ఎస్ ఎఫ్, బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతిపత్రం
హన్మకొండ, నేటిధాత్రి:
అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్
బీఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజేందర్ మాట్లాడుతూ…. వరంగల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను, నాన్ టీచింగ్ సిబ్బంది లేకపోవడం వలన కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో సిలబస్ కాలేకపోవడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతూ విద్యను కొనసాగించే పరిస్థితి నెలకొందని అన్నారు, అదేవిధంగా గురుకుల పాఠశాలలో నాన్ టీచింగ్ సిబ్బంది లేకపోవడం వలన తరగతి గదులు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వలన విద్యార్థులు అనారోగ్యనికి గురై పరిస్థితి నెలకొందని అన్నారు. కలెక్టర్ గారు తక్షణమే స్పందించి వరంగల్ జిల్లా పరిధిలోని ఉన్న నూతన ఉపాధ్యాయులతో పాటు నాన్ టీచింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్ రఘు శ్రవణ్ ప్రమోద్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.