పరకాల నేటిధాత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆశీస్సులతో పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైన చందుపట్ల రాజిరెడ్డి శనివారం రోజున పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు.అనంతరం చైర్మన్ రాజిరెడ్డిని సోదా అనిత రామకృష్ణ వారికి స్వీటు మరియు శాలువా కండువాతో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు మహమ్మద్ అలీ,యూత్ నాయకులు మచ్చ సుమన్,నాయకులు మునిగంటి విష్ణువర్ధన్,బత్తిని నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
