-బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి
-ముచ్చ యాదగిరి రావు, రసాల రమేష్
-గ్రామ పార్టీ ఆధ్వర్యంలో
ఖానాపూర్ నేటిధాత్రి
ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ లో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇందిరా కాలనీలో ప్రచారం చేస్తూ నేతకాని కులస్థుల కుల దైవం అయినటువంటి ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి నర్సంపేట ఎమ్మెల్యే గా పెద్ది సుదర్శన్ రెడ్డి గెలవాలాని మరియు గెలుపు అనంతరం పోతురాజుకు యట పోతుని బలి ఇస్తాము అని నేతకాని కుల పెద్ద మనుషుల ఆధ్వర్యంలో మరియు బిఆర్ఎస్ గ్రామ పార్టీ సమక్షంలో ముత్యాలమ్మ తల్లికి మరియు పోతురాజుకు మొక్కు ముడుపులు కట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలొ బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు యాదగిరి రావు, రసాల రమేష్,గొర్రె రవి,కర్ర రమేష్,ముంద్దగుల రవి, తిరుపతి రెడ్డి,జట్టి వెంకన్న, రమేష్, దుస్స పైడి మరియు నేతకానీ నియోజకవర్గం అధ్యక్షులు జనగం ప్రవీణ్ కుమార్, కుల పెద్ద చెన్నూరి సారంగం , జనగం రమేష్, జాడి కిరణ్,తదితరులు పాల్గొన్నారు.