గులాబీ గూటికి చేరిన మావోయిస్టు జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు నేరెళ్ల జ్యోతి

*తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీగా బి.ఆర్.ఎస్ ఉంది

*బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే పార్టీలో చేరాను

– పార్టీలో చేరిన నెరేళ్ల జ్యోతి వ్యాఖ్యలు

కొనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు నెరేళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క శుక్రవారం వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరింది. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీలో చేరిన ఆమెకు జడ్పీ చైర్మన్ అరుణ-రాఘవ రెడ్డి, లక్ష్మీ నరసింహా రావులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో పోలిస్తే తెలంగాణ ఉద్యమ పార్టీగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీగా బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వం గుర్తింపు పొందిందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలంటే బి.ఆర్.ఎస్ పార్టీకే సాధ్యమని భావించి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే గులాబీ గూటిలో చేరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో బి.ఆర్.ఎస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా సుమారు 19ఏండ్ల పాటు మావోయిస్టు పార్టీలో జిల్లా కమిటీ సభ్యురాలిగా, తెలంగాణ ప్రెస్ ఇంచార్జ్ గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన జ్యోతి ఇటీవలే పార్టీని వీడిన సంగతి తెలిసిందే.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version