ఇన్చార్జి ఈవో పర్యవేక్షణ లేక భక్తుల ఆగచాట్లు
వేములవాడ నేటి ధాత్రి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం అంటే ఎంతో ప్రాముఖ్యత చారిత్ర కలిగిన ఆలయం నిత్యం వేలాదిమంది భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది స్వామివారి దర్శనానికి ఎక్కువగా పేద మధ్యతరగతి భక్తులే అధికంగా వస్తుంటారు అయితే భక్తులకు మాత్రం ఆరా కొర వసతులే ఉన్నాయి అధికారులపై పర్యవేక్షణ చేయవలసిన ఆలయ ఈవో పట్టించుకోకపోవడంతో భక్తుల కష్టాలను తీర్చే వారే లేకుండా పోయారు త్వరలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర దృశ్య ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని తర్వాతనే మేడారం సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలో రాజన్న ఆలయానికి రోజురోజుకీ భక్తుల తాకిడి మహా శివరాత్రి జాతరను తలపించేలా ఉంది అయితే రాజన్నకు కానుకల వర్షం కురుస్తున్న భక్తులకు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం అవుతూ వస్తున్నారు భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు జవాబు ఏది అంటే ఆలయానికి పర్మనెంట్ ఈవో లేకపోవడం అని చెప్పుకోవచ్చు ఇంచార్జ్ ఈవోగా కొనసాగుతున్న కృష్ణ ప్రసాద్ వారంలో రెండు రోజులు వేములవాడలో నాలుగు రోజులు హైదరాబాదులో ఉండడంతోనే భక్తుల బాధలు పట్టించుకునే వారే లేరని వాదనలు వినిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయలు వస్తున్న రాజన్న ఆలయం పై రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని సామాన్య భక్తులు మండిపడుతున్నారు అధికారులతో నామమాత్రపు సమావేశాలు ఎన్ని ఏర్పాటు చేసిన ఫలితం లేదని అసలే సమ్మక్క సారక్క జాతర ఆ తర్వాత మరో పది రోజులు తిరగకముందే మహాశివరాత్రి జాతర నేపథ్యంలో లక్షలాది భక్తులు రాజరాజేశ్వరుని దర్శించుకునేందుకు వస్తారు రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బంది దర్శనానికి వస్తున్న రాజన్న భక్తుల పట్ల ఎంతో ఓపిక సహనంతో ఉండి భక్తుల మనోభావాలు కాపాడాలని భక్తులు కోరారు అదేవిధంగా రాజన్న ఆలయానికి ఇంచార్జ్ ఈవో కాకుండా పర్మనెంట్ ఈవో ను కేటాయించాలని రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు