మెదక్ ఎంపీగా నీలం మధు గెలుపు ఖాయం

బిజెపి, బిఅర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు దక్కవు…..

మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్,
, మహమ్మద్అప్సర్, దామోదర్ రెడ్డి ….

కొల్చారం( మెదక్) నేటిధాత్రి:-

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయం అని జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ అన్నారు.సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు యువకుడు పేద ప్రజల బాగోగులు తెలిసిన మానవత్వం పరిమళించే మనసున్న మంచి మనిషి కాబట్టి అభివృద్ధి తోపాటు అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసే భాగ్యం ప్రజలు కల్పిస్తారని ఉద్ఘాటించారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో అపారమైన జ్ఞానం ఉన్న నీలం మధు ఒక యువ నేత అని కొనియాడారు. నీలం మధు ఒక సర్పంచ్ గా తన విధానాలు, వ్యూహాలతో ఎన్నో అద్భుతాలు చేసి అభివృద్ధి చేశారన్నారు. అంతేకాదు మానవ జీవితానికి సంబంధించి అనేక విషయాలను తన అనుభవాలతో ప్రజల మనస్సు దోచుకున్నాడని వివరించారు. తన నియమాలను, పద్ధతులను ఇప్పటికీ విధిగా పాటించి అన్ని రంగాల్లో నీలం మధు విజయం సాధించారన్నారు. ఎందుకంటే రాజ్యాన్ని పాలించే నాయకుడు సరైన మార్గంలో నడిస్తేనే తమ రాజ్యం కూడా మంచిగా ఉంటుందని వివరించాడు. నీలం మధు పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని పేర్కొన్నారు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యర్థులు ఉండటం సహజం. వారికి భయపడకుండా నీలం మధు ధైర్యంగా ఎదుర్కొని నిలబడి మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తారనీ స్పష్టం చేశారు. రాజకీయాల్లో నాయకుడిగా అంచలంచెలుగా ఎదిగి నాయకత్వం వహించే ఉత్తమ లక్షణాలు ఉన్న నీలం మధు అనేక విషయాల్లో అపార అనుభవం గడించిన నీలం మధు పక్కా విజయకేతనం ఎగరేస్తాడని వివరించాడు. అంతేకాదు నీలం మధు పాలనలో కుల మతాలకు అతీతంగా వర్గ వెభాధాలకు తావు లేకుండా కచ్చితంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాడని వివరించాడు. నీలం మధు నిజమైన రాజకీయ నాయకుడు రాజనీతి శాస్త్రంపై పూర్తి అవగాహన కలిగి ఉన్న మధన్న గెలుపే లక్ష్యంగా అందరం కలిసి కట్టుగా పనిచేసి భారీ మెజార్టీ తో గెలిపించుకుంటామని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ తెలిపారు. నీలం మధు ను గెలిపిస్తే ఎల్లప్పుడూ న్యాయబద్ధంగా ఉండి ప్రజల ప్రయోజనాల కోసమే పని చేస్తూ. నీతి, వివేకం, విజ్ఞానంతో, సమాజ పురోగతికి పాటుపడి నిజమైన రాజకీయ నాయకుడు గా మంచి పేరు తెచ్చుకుంటారు అని బుడ్డ భాగ్యరాజ్ వివరించారు. నీలం మధు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరి అభిప్రాయాలను తెల్సుకుని అందరికీ నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా నిర్ణయాలను తీసుకోనీ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్తాడని బుడ్డ భాగ్యరాజ్ తెలిపారు. నీలం మధు ప్రజాసేవపై నిరంతరం ఆసక్తి చూపి, సామాజిక సేవే భగవంతుని సేవ అనే భావనతో ప్రతి నిత్యం ప్రజల కోసం పని చేసే నాయకుడని వివరించాడు. ప్రజలే ఆయన బలగం, ప్రజలే ఆయన బలం అని నిరూపించుకోవడానికి ఇది చక్కటి అవకాశం అని అన్నారు.ఈ మీడియా సమావేశంలో లంబవెంకటేష్ యాదవ్, దొంతి యాదగిరి,ఆకుల కుమార్,పన్నీర్ రాము,మంజు నాగరాజుగౌడ్, గడ్డంప్రశాంత్ కుమార్,మహేష్ యాదవ్ తోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version