నేటిధాత్రి, వరంగల్
నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ను పురస్కరించుకొని వరంగల్ కొత్తవాడలోని గోల్డెన్ కిడ్స్ హైస్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు ప్రిన్సిపల్ మాధవి ఆధ్వర్యంలో చిన్నారులు నర్సరీ నుండి పదవ తరగతి వరకు తమకు నచ్చిన విభాగాలలో ఎగ్జిబిట్లను ప్రయోగాత్మకంగా అబ్బురపడే విధంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ సుజాత పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే విధంగా వారిలోని సృజనాత్మకత ప్రతిభా పాటవాలు ఆవిష్కరించే విధంగా వివిధ రంగాలకు చెందిన ప్రయోగాలను విద్యార్థులు ప్రదర్శించడం ఇలాంటి కార్యక్రమాల ద్వారా జరుగుతాయని, విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో పాఠశాల టీచర్స్ పావని, వనిత, హేమలత, జ్యోతి, రాణి, స్వప్న, అజంతా, శిరీష , అస్మా, రజిత, శివ, సుగుణాకర్, కిరణ్, బాలమణి, హరిప్రియ, చంద్ర శేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.