వేములవాడ, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానం రెండవ కల్యాణ కట్టలో పనిచేస్తున్న సుమారు 50మంది నాయీబ్రాహ్మణ సోదరులు మంగళవారం బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావును వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు చల్మెడకే ఉంటుందని ఏకగ్రీవ తీర్మానం చేసి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్మన్ అరుణ-రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి-రాజుల సమక్షంలో తీర్మాన పత్రాన్ని చల్మెడకు అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పెద్దపల్లి నర్సయ్య, ప్రధాన కార్యదర్శి కళ్యాణం లక్ష్మణ్, కోశాధికారి వెలిచాలా తిరుపతి, సహాయ కార్యదర్శులు గడ్డం తిరుపతి, గడ్డం నరేష్, ఒరగంటి శ్రీశైలం, సూత్రం శ్రీనివాస్, సావనపల్లి కమలాకర్, ప్రదీప్, శ్రీనివాస్, నవీన్, రాజేందర్, వాడ్నాల తిరుపతి, అనిల్,గంధం శ్రీనివాస్, సాయిరాం, పసునూరి తిరుపతి, సంపేట బాలాజీ, సాయి,తదితరులు పాల్గొన్నారు.
