మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన సిపిఐ.
పరిశుభ్రం లేని మాంసంను విక్రయిస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలి.
సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మటన్,చికెన్ సెంటర్ యాజమాన్యంల ఫై చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణం లోని మటన్,చికెన్ సెంటర్లు పరిశుభ్రమైన మాంసాన్ని విక్రాయించడం లేదన్నారు. ముఖ్యంగా ఆరోగ్యమైన మేకలు కోయటం లేదన్నారు. మేకల,గొర్రెల సంబంధిత అధికారులు తనిఖీ చేసాకనే మంచివైతేనే వాటిని కోసి విక్రయాలు చేపట్టాలి కానీ అలా జరగటం లేదు అని అన్నారు. స్లానిటరీ హౌస్ ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మటన్,చికెన్ సెంటర్లు మెయిన్ రోడ్ కు ఉండటం వల్ల దుమ్ము ధూళి వాలిన మాంసాన్ని విక్రయిస్తున్నారు అని అన్నారు. అంతేకాకుండా ఉదయం ఐదు గంటలకు కోసిన మాంసాన్ని మధ్యాహ్నం రెండు గంటల వరకు దోమలు,ఈగలు వాలిన మాంసాన్ని అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలను నాశనం చేస్తూ జబ్బుల పాలు చేస్తున్నారు అని అన్నారు. ఏ ఒక్క షాపు కు గ్లాస్ గదులు, గోడ గదులు లేవని అన్నారు. చికెన్ మటన్ సెంటర్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ కు వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. లేని యెడల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాన్ని చేపడతామని ప్రవీణ్ అన్నారు.
ఈ కార్యక్రమం లో సిపిఐ నాయకులు క్యాతారాజు సతీష్,నూకల చంద్ర మొగిలి, వేముల శ్రీకాంత్,నేరెళ్ల జోసెఫ్, పీక రవి, లొకిని రమేష్, గోనెలా తిరుపతి, ఏకు రాములు తదితరులు పాల్గొన్నారు.