ముత్తారం :- నేటి ధాత్రి
ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ముత్తారం మండల సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ లను కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
ముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా అల్లాడి యాదగిరిరావు, వైస్ చైర్మన్గా ఎలువాక కొమురయ్య ను డైరెక్టర్లు ఎన్నుకున్నారు..అనంతరం సబ్ రిజిస్టర్ చైర్మన్ వైస్ చైర్మన్ ను ఎన్నుకున్నట్లు ప్రకటించారు అనంతరం ఎన్నికైన వారికీ మాజీ జడ్పీటీసీ జగన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ శుభాకాంక్షలు తెలిపారు ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు