ప్రభుత్వ రంగం లో కంటే ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ.
కళాశాల ప్రిన్సిపల్ డా. అప్పియ చిన్నమ్మ.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని డా..బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్, కెరియర్ గైడెన్స్ సెల్, ఎంటర్ ప్రినర్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం సంయుక్త ఆధ్వర్యంలో క్యాంపస్ టు కార్పోరేట్ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ డా. అప్పియ చిన్నమ్మ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగం లో కంటే ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు. అంతేకాకుండా ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పై మంచి పట్టును సాధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ అకాడమి ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వారు హిందుస్థాన్ కోకా కోలా బేవరేజస్ సహకారంతో నిర్వహించడం జరిగిందన్నారు. క్యాంపస్ టు కార్పోరేట్ ప్రోగ్రాం నందు శిక్షణ ఇవ్వటానికి హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ నుండి బోధిసత్వ అనే శిక్షకుడు డిగ్రీ కళాశాలకు విచ్చేసి,ఈ కార్యక్రమంలో పాల్గొన్న తృతీయ సంవత్సర విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ నందు మరియు ప్రైవేటు రంగ సంస్థలలో ఉద్యోగ అవకాశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని, తెలియజేశారు. అంతేకాకుండా ఇంటర్వ్యూకు వెళ్లే ముందు రెజ్యూమ్ ను ఎలా తయారు చేసుకోవాలో, ఇంటర్వ్యూ నందు ఉండే మెలకువలలో శిక్షణను ఇచ్చారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ రీజనల్ మేనేజర్ సిరాజ్ మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి. శ్రీనివాస్, కెరియర్ గైడెన్స్ సెల్ మరియు ఎంటర్ ప్రినర్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ యాదయ్య, మంజుల అధ్యాపకులు ఎన్. సుభాషిని, టి ఎస్ కె సి మెంటర్ వీర ప్రతాప్ ,మాధవి, అనిత, భార్గవి లత, జగన్ ,180 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన 180 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశామని తెలిపారు.