కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని మంగళవారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ విద్యార్థినులతో ముచ్చటిస్తూ పాఠశాలలోని మంచినీటి సౌకర్యం గురించి భోజనాల సౌకర్యం గురించి మరుగుదొడ్ల సౌకర్యం గురించి మిగతా అన్ని సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో విద్యార్థినులు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి,స్టడీ అవర్స్ ని ఎలా ఉపయోగించుకోవాలి, పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినులు సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే అంశంపై పలు ముఖ్య సూచనలు చేశారు. ఉజ్వల భవిష్యత్తుకు ముఖ్యమైన పునాది ఈ ప్రాథమిక దశలోని విద్యేనని ఇప్పుడు శ్రద్ధతో చదువుకొని మంచి మార్కులతో పరీక్షలు పాస్ అయితేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని కనుక పూర్తి ఏకాగ్రతతో,శ్రద్ధతో ఉపాధ్యాయులు సూచించిన విధంగా కష్టపడి చదువుకొని పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, మండల స్థాయి అధికారులు ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version