ఎంపిడిఓ ను సన్మానించిన మల్లక్కపేట గ్రామపంచాయతీ సిబ్బంది
పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని అలియాబాద్, మల్లక్కపేట,వెల్లంపల్లి,పోచారం లో గల ఈజీఎస్ నర్సరీలను మరియు గ్రామపంచాయతీలను నూతనంగా వచ్చిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు పరిశీలించారు.అనంతరం గ్రామాలలో పాఠశాలలు, అంగన్వాడీలను తనిఖీచేసి మధ్యాహ్నం భోజనం విద్య వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.మండలానికి నూతనంగా వచ్చిన ఎంపిడిఓ ను మల్లక్కపేట గ్రామ పంచాయతీ పంచాయతీ సెకరేటరీ శైలజ,కారోబార్ ఆనందరావు శాలువాతో సత్కారించి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్,ఏపిఓ ఇందిరా,టెక్నీకల్ అసిస్టెంట్ సుమలత తదితరులు పాల్గొన్నారు.