జైపూర్, నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం మహిళలకు మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ పత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన మహిళలకు మహాలక్ష్మి పథకం క్రింద రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న విషయం తెలిసిందే, ఇందుకు సంబంధించిన సబ్సిడీ పత్రాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళలకు అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే మహాలక్ష్మి పథకం క్రింద ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తుందన్నారు. కట్టెల పొయ్యి పొగనుడి మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్యేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వారి బ్యాంక్ ఖాతాలోకి మిగతా డబ్బులు జమ అవుతున్నాయని కానీ చాలా మంది మహిళలు ఈ విషయం గమనించటం లేదన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, పంచాయతీ కార్యదర్శి ఉదయ్ కుమార్, స్థానిక మాజీ ఎంపీటీసీ సభ్యులు మంతెన లక్ష్మణ్, మాజీ ఉప సర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు కె. ప్రశాంత్ రెడ్డి, అరిగల శ్రీనివాస్ పాల్గొన్నారు.