జైపూర్, నేటి ధాత్రి:
పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచిన సందర్భంగా శ్రీవారి ఆశీర్వాదం కోసం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శనివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలతో పండితులు ఆశీర్వదించారు.