ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ప్రముఖులతో కలిసి వీరనారి ఐలమ్మకు ఘన నివాళులు

Date 26/09/2024
—————————————-
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు,ఆత్మగౌరవ ప్రతీక,వీరనారి చిట్యాల ఐలమ్మకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన బీసీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు

తమిళనాడులో బీసీల సంక్షేమం, సముద్ధరణకు అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల గురించి అధ్యయనానికి గాను చెన్నై వెళ్లిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్,మండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,మాజీ మంత్రులు గంగుల కమలాకర్,జోగు రామన్న,వీ.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, కోరుకంటి చందర్, పుట్టా మధుకర్,జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వీ.ప్రకాష్,పార్టీ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, సర్థార్ పుటం పురుషోత్తమ రావు తదితర ప్రముఖులు ఐలమ్మ చిత్రపటానికి పూలు జల్లి శ్రద్ధాంజలి ఘటించారు

అలాగే, బీసీ కమిషన్ మాజీ సభ్యులు జూలూరు గౌరీశంకర్, ఆంజనేయులు గౌడ్, శుభప్రద పటేల్, కిశోర్ గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ దత్తాత్రి తదితరులు ఐలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, జోహార్లు అర్పించారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version