Date 15/02/2024
—————————————-
రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ రవిచంద్ర నామినేషన్ దాఖలు
ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, కమలాకర్,నాగేందర్,రాజేశ్వర్ రెడ్డి, జగదీష్ రెడ్డిలు వెంట రాగా నామినేషన్ వేసిన ఎంపీ రవిచంద్ర
తెలంగాణ భవన్ నుంచి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,అభిమానులతో ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్న ఎంపీ రవిచంద్ర
గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించిన ఎంపీ రవిచంద్ర
“జోహార్లు జోహార్లు అమరవీరులకు జోహార్లు”,”జై తెలంగాణ జైజై తెలంగాణ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”అంటూ నినాదాలు
ఎంపీ రవిచంద్రకు వెల్లువెత్తిన శుభాకాంక్షలు
తెలంగాణ నలుమూలల నుంచి తరలివచ్చిన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు
ఎంపీ రవిచంద్రకు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపిన శాసనమండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ ప్రకాష్,మంత్రి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీలు కవిత,సత్యవతి రాథోడ్, మధుసూదనాచారి,తాతా మధు, రవీందర్ రావు తదితరులు
రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు.శాసనసభ ఆవరణలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి ఎమ్మెల్యేలు కే.టీ.రామారావు, తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్,కడియం శ్రీహరి,వేముల ప్రశాంత్ రెడ్డి,దానం నాగేందర్, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,జగదీష్ రెడ్డి, డాక్టర్ తెల్లం వెంకట్రావులు తన వెంట రాగా గురువారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆయన్ను ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, భండారు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, అసెంబ్లీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.రవిచంద్ర రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే, ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా డాక్టర్ బండా ప్రకాష్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయగా 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.కాగా, ఇప్పుడు రాజ్యసభకు ఎన్నికలు రావడంతో వద్దిరాజు అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖరారు చేశారు.దీంతో,ఎంపీ రవిచంద్ర తెలంగాణ భవన్ లో ఆచార్య జయశంకర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు.భవన్ లో జరుగుతున్న సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో లోకసభ సభ్యురాలు మాలోతు కవిత,మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ,బీఆర్ఎస్ నాయకులు రాంచందర్ నాయక్, బానోతు హరిసింగ్ నాయక్,గాంధీనాయక్ తదితరులతో కలిసి పాల్గొన్నారు.
ఆ తర్వాత ఎంపీ రవిచంద్ర తన అన్నలు వద్దిరాజు కిషన్, వద్దిరాజు దేవేందర్, వద్దిరాజు వెంకటేశ్వర్లు,కుమారులు సాయి నిఖిల్ చంద్ర, నాగరాజు,ప్రీతమ్, అల్లుడు విజయ్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, శ్రేయోభిలాషులు వెంట రాగా నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి బయలుదేరారు.రవీంద్రభారతి వద్ద మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు రౌతు కనకయ్య తదితరులు కలిసి పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.ఎంపీ వద్దిరాజు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా “జోహార్లు జోహార్లు అమరవీరులకు జోహార్లు”,”జై తెలంగాణ జైజై తెలంగాణ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”అనే నినాదాలు హోరెత్తాయి.అటుతర్వాత రవిచంద్ర రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు.
-Pulipati Damodar PRO to Vaddiraju Ravichandra MP Gaaru