మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
పాలమూరు జిల్లా కేంద్రం అన్నపూర్ణ గార్డెన్ లో జరగబోయే అభినందన సభకు వెళ్లే మార్గంలో రాజపూర్ మండల కేంద్రంలోని ముఖ్య కూడలిలో ఎంపీ గా గెలుపొందిన తరువాత మొదటి సారిగారిగా రాజాపూర్ మండలానికి విచ్చేసిన ఎంపీ.డీకే అరుణమ్మకు రాజపూర్ బిజెపి నాయకులు ఏబీవీపీ నాయకులు ఘానా స్వాగతం పలికారు. రాజపూర్ మండల కేంద్రంలో జూనియర్ కళాశాల కోసం డీకే అరుణమ్మ కి బిజెపి నాయకులు ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎంపీ సానుకూలంగా స్పందించి మాట్లాడుతూ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి మీ మండలానికి కచ్చితంగా వచ్చే విధంగా నా వంతుగా కృషి చేస్తానని అన్నారు. గతంలో కూడా జూనియర్ కాలేజీ గురించి ముఖ్యమంత్రితో చర్చించడం జరిగిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆర్ బాలా త్రిపుర సుందరి, బిజెపి మండల అధ్యక్షులు కావాలి రామకృష్ణ,ఏబీవిపి నాయకులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.