-జిల్లా కౌన్సిల్ నెంబర్ గా పెండ్లి మల్లారెడ్డి
-విధేయతకే పట్టం కట్టిన అధిష్టానం
మొగులపల్లి నేటి ధాత్రి
భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన మోరే వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ గా మండలంలోని ఇస్సిపేట గ్రామానికి చెందిన పెండ్లి మల్లారెడ్డిని నియమించినట్లు ఎన్నికల అధికారి చందుపట్ల కీర్తి-సత్యపాల్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులు నాగపూరి రాజమౌళి గౌడ్ లు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పార్టీని మండలంలో విస్తరింప చేసేందుకు మోరే వేణుగోపాల్ రెడ్డి ఏనలేని కృషి చేశాడని, ప్రజా ఉద్యమాలను నిర్వహించడంలో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను..ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు విశేష కృషి చేశాడని గుర్తించిన అధిష్టానం ఆయన సేవలను మరింతగా ఉపయోగించుకునేందుకు బిజెపి మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. బిజెపి మండల అధ్యక్షుడి రేసులో ఆరుగురు ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం విధేయతకు పట్టం కట్టింది. అదేవిధంగా మోరే వేణుగోపాల్ రెడ్డి బీజేవైఎం మండల అధ్యక్షుడిగా, బిజెపి మండల కోశాధికారిగా, మండల ఉపాధ్యక్షుడిగా, మండల ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన బిజెపి పార్టీ ఎదుగుదలే తన లక్ష్యంగా పనిచేశారు.
-భాజపా శ్రేణుల సంబరాలు
కాగా నూతనంగా ఎంపికైన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి నియామకమైనందున మండలంలోని వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకున్న కాషాయ శ్రేణులు మొగుళ్ళపల్లి చౌరస్తాలో బాణాసంచా పేల్చి, స్వీట్లను, పండ్లను పంపిణీ చేశారు. బిజెపి జిందాబాద్..నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో మారుమోగించారు. ఈ సందర్భంగా నూతనంగా మండల అధ్యక్షుడిగా నియమితులైన మోరే వేణుగోపాల్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తూ..పార్టీని గ్రామ గ్రామాన విస్తరింప చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి సత్తా చాటే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తానని ఆయన తెలిపారు. తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి, నాగపూరి రాజమౌళి గౌడ్, జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యులు చదువు రామచంద్రారెడ్డి, వెన్నంపల్లి పాపయ్య, కన్నం యుగంధర్, బిజెపి రాష్ట్ర నాయకులు జన్నే మొగిలి, బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, బిజెపి మాజీ మండల అధ్యక్షుడు చేవ్వ శేషగిరి యాదవ్ లకు వేణుగోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.